బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని వైసీపీలో తొక్కేశారా...!

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వైసీపీ యంగ్ ఫైర్‌బ్రాండ్ లీడ‌ర్‌.క‌ర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీ ఇన్‌చార్జ్.

 Is Ysrcp Backstabbing Byreddy Siddharth Reddy, Byreddy Siddarth Reddy,andhra Pra-TeluguStop.com

కేవ‌లం 25 ఏళ్ల వ‌య‌స్సులోనే నందికొట్కూరు వైసీపీ ఇన్‌చార్జ్‌గా బైరెడ్డిని జ‌గ‌న్ నియ‌మించారు అంటే బైరెడ్డిపై జ‌గ‌న్‌కు ఎంత న‌మ్మ‌కం ఉందో ?  నియోజ‌క‌వ‌ర్గ జ‌నాల్లో ఎంత క్రేజ్ ఉందో తెలుస్తోంది.బైరెడ్డి ఏం మాట్లాడినా రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యేది.

చివ‌ర‌కు హాట్ న‌టి శ్రీరెడ్డి సైతం బైరెడ్డి స్పీచ్ చూసి నీతో ఒక్క నైట్ అయినా డేట్ చేయాల‌ని ఉంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.దీనిని బ‌ట్టే బైరెడ్డిలో ఫైర్ ఏంటో తెలుస్తోంది.

నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థ‌ర్ ఉన్నా కూడా పెత్త‌నం అంతా బైరెడ్డిదే.చివ‌ర‌కు ఎమ్మెల్యేకు బైరెడ్డికి వార్ జ‌రిగిన‌ప్పుడు జ‌గ‌న్‌తో పాటు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అనిల్ నుంచి సీనియ‌ర్లు అంద‌రూ కూడా బైరెడ్డికే స‌పోర్ట్ చేశారు.

ఏపీలోనే ఎక్క‌డా లేని విధంగా నందికొట్కూరులో మాత్ర‌మే ఎమ్మెల్యేగా ఆర్థ‌ర్ ఉంటే… బైరెడ్డి నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు.ఇక ఆయ‌న‌కు నామినేటెడ్ ప‌ద‌వుల్లో భాగంగా డీసీసీబీ చైర్మ‌న్ వ‌స్తుంద‌న్న ప్ర‌చారం జ‌రిగినా రాలేదు.

ఇక బైరెడ్డి దూకుడును త‌ట్టుకోలేని వైసీపీలోని ఓ వ‌ర్గం ఆయ‌న్ను టీడీపీ వాళ్ల‌తోనే క‌లిసి మ‌రీ తొక్కేస్తోంద‌న్న చ‌ర్చ‌లు క‌ర్నూలు రాజ‌కీయాల్లో వినిపిస్తున్నాయి.

Telugu Andhra Pradesh, Siddarth Reddy, Ysrcpsiddharth-Telugu Political News

కొద్ది రోజులుగా బైరెడ్డి మాట ఎక్క‌డా విన‌ప‌డ‌డం లేదు.కొద్ది రోజులుగా బైరెడ్డి సొంత పార్టీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌తోనే ఇబ్బంది ప‌డుతుంటే మ‌రోవైపు ఆయ‌న ఎదుగుద‌ల ఓర్వ‌లేని వైసీపీలోని ఓ వ‌ర్గంతో పాటు ఆయ‌న పెద‌నాన్న అయిన బైరెడ్డి రాజ‌శేఖ‌ర్ రెడ్డి చేయి చేయి క‌లిపి మ‌రీ రాజ‌కీయంగా ఎద‌గ‌కుండా చేస్తున్నార‌న్న గుస‌గుస‌లు స్థానికంగా వినిపిస్తున్నాయి.ఇక క‌ర్నూలు జిల్లాలోనే వైసీపీ సీనియ‌ర్ నేత‌లు సైతం బైరెడ్డికి వ‌స్తోన్న క్రేజ్ చూసి సీఎం జ‌గ‌న్‌కు ఆయ‌న‌పై త‌ప్పుడు రిపోర్టులు ఇవ్వ‌డంత‌నే ఇటీవ‌ల సీఎంకు, సిద్ధార్థ్‌కు మ‌ధ్య చిన్న పొర ఏర్ప‌డింద‌ని ఆయ‌న అభిమానులు వాపోతున్నారు.

ప్ర‌స్తుతం బైరెడ్డి అభిమానులు సోష‌ల్ మీడియాలో ఇదే విషయంపై డిస్క‌ర్ష‌న్స్ స్టార్ట్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube