ఆ రాజమార్గమే జగన్ కి చేటు తెస్తోందా       2018-07-07   02:10:27  IST  Bhanu C

రాజకీయాల్లో వైఎస్ కుటుంబానికి ఒక క్రెడిబులిటీ ఉంది. విశ్వసనీయతకు పెట్టింది పేరు ఆ కుటుంబం. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా నమ్మిన వారికోసం ఏదైనా చేయగలిగే తెగువ వైఎస్ ఫ్యామిలీకి ఉందని రాజకీయ వర్గాల్లో ఒక రకమైన అభిప్రాయం ఉంది. రాజశేఖరరెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరి వ్యక్తిత్వాలు పరిశీలిస్తే… ఇద్దరూ కూడా పట్టుదలగా, కష్టపడి ప్రజాభిమానం పొందాలనే కృషి చేయాలనుకుంటారు. అలాగే ప్రజలను మోసం చేసి, అబద్ధపు హామీలతో కుర్చీ ఎక్కాలని ఆశించారు. ఇంకెవరి పదవినో లాక్కోవాలనో, వెన్నుపోటు రాజకీయాలో, కుట్ర రాజకీయాలో చేసే నైజం ఇద్దరిలోనూ కనిపించదు. కానీ ప్రస్తుత రాజకీయాల్లో జగన్ వెనుకబడిపోవడానికి కూడా అదే కారణంగా కనిపిస్తోంది.

ఈ విషయం లో మిగతా నాయకులను కనుక పరిగణలోకి తీసుకుంటే.. చంద్రబాబుతో సహా పవన్‌ని కూడా ఈ విషయంలో నమ్మలేని పరిస్థితి. యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కొంతమందికి సీటు హామీ ఇచ్చి ఆ తర్వాత హ్యాండ్ ఇచ్చాడు పవన్. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో, డైరెక్ట్ రాజకీయాలు చేయడంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్‌లిద్దరిదీ కూడా రాజమార్గమే.అయితే దొడ్డిదారి రాజకీయాలు, దొంగ రాజకీయాలు ఎదుర్కోవడం వైఎస్ రాజశేఖరరెడ్డి సక్సెస్ అయ్యాడు. కానీ జగన్ మాత్రం ఇంకా తడబడుతూనే ఉన్నాడు. ఇదే ఆయనకు పెద్ద మైనెస్ గా మారింది.

ఇక జగన్ ని ఎదుర్కొనేందుకు చంద్రబాబు కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. ఆఖరికి టీడీపీ ఆగర్భ శత్రువైన కాంగ్రెస్ తో అంటకాగేందుకు కూడా బాబు వెనకాడడంలేదు. అంతే కాదు బాబు కి మీడియా పలుకుబడి కూడా బాగా ఎక్కువ ఉండడంతో జగన్ కి మైలేజ్ రాకుండా వ్యతిరేక కథనాలు వండి వారుస్తున్నారు. జగన్ ఈ విషయం లో వెనకబడిపోయాడు. బాబు మాత్రం జగన్ ని దెబ్బకొట్టడానికి కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ని మాలీ కాంగ్రెస్ లో చేరేలా తెరవెనుక మంతనాలు చేసాడు.

రెడ్డి సామాజికవర్గానికి చెందిన కిరణ్ ని కాంగ్రెసులోకి పంపడం ద్వారా రాయలసీమలోని ఆ సామాజికవర్గం ఓట్లు భారీగా చీల్చాలని బాబు కుట్ర పన్నుతున్నాడు. అయితే ఈ ఎత్తుగడలను జగన్ ఎలా ఎదుర్కొంటాడు..? ఇంకా విలువలు విశ్వసనీయతలు అంటూ జగన్ వాటినే నమ్ముకుంటే ప్రస్తుత రోజుల్లో వర్కవుట్ అవ్వదనే విషయం ఆయన గ్రహిస్తాడా అనేది తేలాల్సి ఉంది. జగన్ నిర్ణయంపైనే వైసీపీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.