మహాతల్లి జాహ్నవికి కరోనా అంటూ ప్రచారం.. నిజమేంటంటే?  

మహాతల్లి యూట్యూబ్ ఛానల్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో పాపులారిటీని సంపాదించుకున్నారు జాహ్నవి దాశెట్టి.కర్నూలుకు చెందిన జాహ్నవి అందరిలా కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోవాలని భావించి యూట్యూబర్ గా ఎదిగారు.జాహ్నవి యూట్యూబ్ ఛానల్ కు ఏకంగా 17.8 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు.మొదట్లో పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకున్న జాహ్నవి ఆ తరువాత మహాతల్లి ఛానెల్ తో టాప్ యూట్యూబర్ గా ఎదిగారు.

TeluguStop.com - Is Youtube Star Mahatalli Fame Jahnavi Dasetty Corona Infected

జాహ్నవికి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని సమాచారం.

అయితే గత రెండు మూడు రోజుల నుంచి జాహ్నవికి కరోనా వైరస్ సోకినట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.ఇప్పటికే దేశంలోని రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు కరోనా వైరస్ బారిన పడ్డారు.

TeluguStop.com - మహాతల్లి జాహ్నవికి కరోనా అంటూ ప్రచారం.. నిజమేంటంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

జాహ్నవికి కరోనా సోకిందని వార్తలు వైరల్ కావడంతో ఆమె ఫ్యాన్స్ కంగారు పడ్డారు.

ఈ విషయం జాహ్నవి దృష్టికి రావడంతో ఆమె వైరల్ అవుతున్న వార్తలపై స్పందించి వివరణ ఇచ్చింది.కొన్ని రోజుల నుంచి తనలో కరోనా వైరస్ లక్షణాలైన జలుబు, దగ్గు కనిపించాయని దీంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని.అయితే కరోనా పరీక్షల్లో నెగిటివ్ నిర్ధారణ అయిందని ఫ్యాన్స్ కంగారు ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది.

తాను జలుబుతో బాధ పడుతున్నానని కంగారు పడవద్దని ఫ్యాన్స్ కు తెలిపింది.

జాహ్నవి చేసే ప్రతి వీడియోకు లక్షల సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి.

యువత, విద్యార్థులకు ఆకట్టుకునేలా జాహ్నవి వీడియోలు ఉంటాయి.ముంబైలో మంచి ఉద్యోగం వచ్చినా యూట్యూబర్ గా ఎదగడానికే ప్రాధాన్యతనిచ్చిన జాహ్నవి సక్సెస్ ఫుల్ యూట్యూబర్ గా ఎదిగారు.

బిగ్ బాస్ సీజన్ 4లో జాహ్నవి, ఆమె భర్తకు ఆఫర్ వచ్చినా కొన్ని కారణాల వల్ల ఆ షోలో పాల్గొనడానికి అంగీకరించలేదని సమాచారం.

#IsYoutube #Bigg Boss4 #YoutubeStar #Mahathalli #InfectedCorona

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు