మీ ఫేస్ బుక్ అకౌంట్ సేఫెనా..?! సురక్షితంగా ఉండాలంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వాల్సిందే..!

నేటి రోజుల్లో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి.సోషల్ మీడియాలో వివరాలు సేకరించి ఫోటోలు మార్పింగ్ చేయడమో, డబ్బులు కావాలని బెదిరించడమో, బ్లాక్ మెయిల్ చేయడమో.

 Is Your Facebook Account Safe You Need To Follow These Steps To Be Safe-TeluguStop.com

ఇలా రకరకాల దోపిడీలు జరుగుతున్నాయి.అందుకే ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండటం ఎంతో ఉత్తమం.

తాజాగా ఫేస్ బుక్ పై పెద్ద దుమారమే రేగుతోంది.చాలా మంది సైబర్ నేరగాళ్లు ఫేస్ బుక్ డేటా ఆధారంగానే తమ కార్యకలాపాలు సాగిస్తున్నారంటూ చర్చ నడుస్తోంది.

 Is Your Facebook Account Safe You Need To Follow These Steps To Be Safe-మీ ఫేస్ బుక్ అకౌంట్ సేఫెనా.. సురక్షితంగా ఉండాలంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వాల్సిందే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందుకే ఫేస్ బుక్ నుంచి యూజర్ల డేటా హ్యాక్ కి గురికాకుండా ఉండేందుకు ఫేస్ బుక్ సంస్థ కొన్ని ఫీచర్స్ ను తీసుకొస్తోంది.ఫేస్ బుక్ నుంచి ఫ్రొఫైల్ భద్రత కొసం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.

అటువంటి సెట్టింగులేంటో ఒకసారి తెలుసుకుందాం.

స్టెప్​ 1: మీరు ఫేస్ బుక్ అకౌంట్ కు లాగిన్ అవ్వాలి.ఆ తర్వాత ‘సెట్టింగ్స్, ప్రైవసీ’ పేజీలోకి వెల్లాలి.

స్టెప్ 2: ఆ తర్వాత మెనూ బార్ వద్ద ఉన్నటువంటి ‘సెక్యూరిటీ అండ్​ లాగిన్​’ అనే దానిపై క్లిక్ చేయాలి.

స్టెప్ 3: అక్కడే ఉన్నటువంటి ‘వేర్​ యూ ఆర్​ లాగ్డ్​ ఇన్​’ అనేదానిని సెలక్టు చేసుకోవాలి.తర్వాత త్రీ డాట్​ మెనూపై క్లిక్​ చేసి ‘లాగ్​ అవుట్​’ అనేదానిని ఎంపిక చేయాలి.

దీంతో మీరు అన్ని సెషన్ల నుంచి ఒకేసారి లాగ్ అవుట్​ అయిపోతారు.

Telugu Facebook, Facebook Messger, Online Application, Safe, Social Media, Tips-Latest News - Telugu

స్టెప్ 4: ఆ తర్వాత కనిపించే ‘లాగిన్’ ఆప్షన్​ వద్ద ఉన్న ‘సేవ్​ యువర్​ లాగిన్​ ఇన్ఫర్మేషన్​’ పైన నొక్కండి.ఈ విధంగా చేస్తే మీరు లాగిన్ అయ్యుండేది సురక్షితంగా ఉంటుంది.మీరు ఈ పద్దతిని మీ పర్సనల్ కంప్యూటర్ లో మాత్రమే చేస్తే మీకు చాలా మంచిది.

స్టెప్​ 5: సెట్టింగు లోని మెనూలో ఉన్నటువంటి ‘టూ ఫ్యాక్టర్​ అథన్టికేషన్​’ ఆప్షన్​ లోకి వెళ్లి ఎడిట్​ ఆప్షన్​ను ఎంచుకోవాలి.అథెంటికేటర్​ యాప్​ లేదా ఎస్​ఎమ్​ఎస్​ ద్వారా అయినా సరే మీరు లాగిన్ అవ్వవచ్చు.

ఈ విధానం​లో మీకు ఒక బ్యాక్​అప్​ కోడ్ అనే ఉంటుంది.దానిని నోట్​ చేసుకుని ఆ తర్వాత మీ అకౌంట్​ లాగిన్​ ఐడి, పాస్​వర్ట్​ తో ఓపెన్ చేయాలి.

అప్పడే మొబైల్​ కు ఓటీపీ వస్తే ఎంటర్ చేయాలి.ఆ తర్వాత లాగిన్ కావచ్చు.

స్టెప్​ 6: ఆ తర్వాత ‘సెట్టింగ్​ అప్​ ఎక్స్​ట్రా సెక్యూరిటీ’ అనేది ఎంచుకోవాలి.​ లాగిన్ అలర్ట్​ సెట్టింగ్​ ను ఆన్​ చేస్తే లాగిన్​ అలర్ట్​ అనేది మీకు వస్తూ ఉంటుంది.

ఒకవేళ మీ ఫేస్​బుక్​ ఖాతాలోకి వేరే ఫోన్ నంబర్​ నుంచి లాగిన్​ అయితే, వెంటనే దాన్ని గుర్తించి ఫేస్​ బుక్​ మీ ఈ–మెయిల్​ కు లేదా ఫేస్​ బుక్​కు అలర్ట్ మెసేజును పంపుతుంది.

స్టెప్ 7: ఇకపోతే ఆఖరుగా ‘సెట్టింగ్​ అప్​ ఎక్స్​ట్రా సెక్యూరిటీ’ ని ఎంపిక చేసుకుని అక్కడ మీ ఫేస్​ బుక్​ లోని ముగ్గురు నుంచి ఐదుగురు స్నేహితులను ఎంచుకోవాల్సి ఉంటుంది.దీనివల్ల మీరు ఏ సందర్భంలోనైనా మీ ఫేస్ బుక్ అకౌంట్ ను ఓపెన్ చేయలేకపోతే వారి అకౌంట్స్ నుంచి లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది.

#TIps #Facebook #Safe #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు