చంద్ర‌బాబు విష‌యంలో వైసీపీ పొర‌పాటు చేస్తోందా...?

రాజ‌కీయాలు అన్న త‌ర్వాత విభేదాలు వ‌ర్గ‌పోరు లాంటి స‌ర్వ స‌హ‌జం.కానీ అవి అవి హ‌ద్దులు దాటితేనే ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ త‌గ్గిపోతుంది.

 Is Ycp Making A Mistake In The Case Of Chandrababu ...? Chandrababu, Ycp, Ap Pol-TeluguStop.com

ఇక రాజ‌కీయాల్లో ఎవ‌రు అధికారంలో ఉన్నా స‌రే ప్రోటోకాల్ లాంటివి క‌చ్చితంగా పాటించాల్సిందే.ఇక అధికారంలో ఉన్న పార్టీ ప్రత్యర్థి పార్టీల వారికి క‌చ్చితంగా మ‌ర్యాద‌లు ఇవ్వాల్సి ఉంటుంది.

లేక‌పోతే మాత్రం ప్ర‌జ‌ల్లో చుల‌క‌న అయిపోవ‌డం ఖాయం.గ‌తంలో ఏపీలో చంద్ర‌బాబు అధికారంలో ఉన్న‌ప్పుడు జ‌గ‌న్ విష‌యంలో ఇలాంటి ప్రోటోకాల్‌ను మిస్ అయ్యారు.

ఆయ‌న్ను చాలా విష‌యాల్లో అవ‌మానించారు.దాంతో ప్ర‌జ‌ల్లో ఈ విష‌యం బాగా చొచ్చుకుపోయిది.

దాంతో ఆయ‌న అధికారానికి కూడా దూరం అయిపోయారు.ఇప్పుడు జ‌గ‌న్ అధికారంలో ఉన్న‌ప్పుడు కూడా ఇలాంటి పొర‌పాట్లే జ‌రుగుతున్నాయి.చాలా విష‌యాల్లో చంద్ర‌బాబుకు అవ‌మానాలు జ‌రుగుతున్నాయి.దీంతో ఆయ‌న ప‌ట్ల ప్ర‌జ‌ల్లో సానుభూతి పెరుగుతోంది.

ప్ర‌స్తుతం చంద్ర‌బాబు నియోజ‌క‌వ‌ర్గంలో 12-14 తేదీల్లో పర్యటించబోతున్నా విష‌యం తెలిసిందే.కాగా ఇలా ప‌ర్య‌ట‌న‌లు చేసిన సంద‌ర్భంలో చంద్ర‌బాబు ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో బ‌స చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

అయితే ఈసారి అందుకు భిన్నంగా బస్సులోనే లాడ్జింగ్ బోర్డింగ్ చేసుకున్న‌ట్టు తెలుస్తోంది.

Telugu Ap Poltics, Chandrababu, Kuppam, Lokesh, Rampb Guest, Ys Jagan-Telugu Pol

ఎందుకంటే గ‌తంలో ఇలాగే పర్యటించినప్పుడు ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో చంద్ర‌బాబు విష‌యంలో అధికారులు సరైన ప్రోటోకాల్ ఏర్పాటు చేయ‌లేదంట‌.స‌రైన వ‌స‌తులు కూడా క‌ల్పించ‌లేద‌ని తెలుస్తోంది.గ‌త ఫిబ్రవరి నెల‌లో వ‌చ్చిన‌ప్పుడు క‌నీసం రూమ్‌ను కూడా స‌రిగ్గా క్లీన్ చేయ‌లేద‌ని క‌రెంట్ ప్రాబ్ల‌మ్స్ కూడా వ‌చ్చాయ‌ని చెబుతున్నారు.

ప్ర‌భుత్వ ఒత్తిడుల తోనే ఇలా క‌రెంట్ తీసేసిన‌ట్టు టీడీపీ ఆరోపిస్తోంది.ఇలాంటి ప‌నులు చేయ‌డంతో చంద్ర‌బాబు బ‌స్సులోనే బ‌స చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది.ఈ విధ‌మైన ప్రోటోకాల్ పాటించ‌క‌పోవ‌డం రాబోయే రోజుల్లే న‌ష్టం చేస్తుంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube