ఆ ఇద్ద‌రి విష‌యంలో వైసీపీ తొంద‌ర‌ప‌డుతోందా..?

ఏపీలో రాజకీయాలు ఎప్పుడైనా స‌రే చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి.ఇక్క‌డ జ‌రిగే రాజ‌కీయాలు దేశ వ్యాప్తంగా కూడా చ‌ర్చీనీయాంశంగా మారుతాయి.

 Is Ycp Bothering About Those Two , Ycp, Ap Politics-TeluguStop.com

ఏపీలో అసెంబ్లీ స‌మావేశాలు అంటేనే చ‌ర్చల‌కంటే కూడా స‌వాల్లు, తిట్టుకోవ‌డ‌లం లాంటివే ఎక్కువ‌గా ఉంటాయి.అందుకే మిగ‌తా రాష్ట్రాల కంటే కూడా ఏపీ స‌మావేశాల‌పైనే జాతీయ మీడియా ఎక్కువ‌గా ఫోక‌స్ చేస్తూ ఉంటుంది.

కాగా ఇప్పుడు వైసీపీ తీసుకునే నిర్ణ‌యం గ‌తంలో టీడీపీ తీసుకున్న‌నిర్ణ‌యాల్లాగే క‌నిపిస్తోంది.గ‌తంలో చంద్ర‌బాబు హ‌యాంలో ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకుని త‌ప్పుచేశారు.

ప్ర‌జాస్వామ్యానికి విరుద్ధంగా తీసుకున్న నిర్ణ‌యాల‌తో ఏకంగా అధికారమే కోల్పోయారు.అయితే ఇప్పుడు వైసీపీ ప్ర‌భుత్వం అచ్చెన్నాయుడు, నిమ్మల్ రామానాయుడి విష‌యంలో ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.వీరిద్ద‌రికీ వచ్చే శాసనసభలో స‌మావేశాల్లో మాట్లాడేందుకు ఛాన్స్ ఇవ్వ‌కుండా మైక్ క‌ట్ చేయాల‌ని శాసనసభ హక్కుల సంఘం తీర్మానించడం సంచ‌ల‌నం రేపుతోంది.ఈ ఒక్క‌సారికే కాకుండా ఏకంగా ప్ర‌భుత్వం ఉన్న‌న్ని రోజులు అన‌గా ఇంకో రెండున్నరేళ్ల పాటు వీరిపై ఈ నిషేధం కొనసాగుతుంద‌ని సిఫార్సు చేసింది.

కాగా ఇలాంటి నిర్ణ‌యాలు వైసీపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేక‌త తీసుకువ‌చ్చే ప్ర‌మాదం కూడా ఉంది.అయితే వైసీపీ మాత్రం ఇందుకు కొన్ని కార‌ణాలు కూడా చెప్తోంది.రాష్ట్రంలో ఉన్న మద్యం దుకాణాల సంఖ్యను అచ్చెన్నాయుడు అసెంబ్లీ వేదిక‌గా త‌ప్పుగా చెప్పారని, ఇక పింఛన్ల సంఖ్య విషయంలో కూడా రామానాయుడు ఇలాగే తప్పుగా చెప్పారని అందుకే వారిద్ద‌రిపై ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు చెబుతోంది.కానీ ప్ర‌తిప‌క్షాలు మాత్రం వైసీపీ కక్షపూరితంగా ప్రవర్తిస్తుందని ప్ర‌చారం చేయ‌డం మొద‌లు పెట్టేశాయి.

ఏదేమైనా కూడా వైసీపీ కాస్త ఆలోచించి నిర్ణ‌యం తీసుకోవాల‌ని నిపుణులు అంటున్నారు.ఎందుకంటే ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకునే టీడీపీ అధికారం కోల్పోయింద‌నే విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube