విజయ్‌ దేవరకొండ 'నిన్నుకోరి' కాంబో క్యాన్సిల్‌ అయ్యిందా.. కొత్త పుకార్లతో అనుమానాలు

నిన్ను కోరి మరియు మజిలీ వంటి విభిన్న ప్రేమ కథ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు శివ నిర్వాన ప్రస్తుతం నానితో ‘టక్ జగదీష్‌’ సినిమాను రూపొందిస్తున్నడు.షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న విషయం తెల్సిందే.

 Is Vijay Devarakonda Movie Cancel With Shiva Nirvana Under Mytri Movie Makers Ba-TeluguStop.com

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఆ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.ఇక టక్ జగదీష్‌ తర్వాత శివ నిర్వాన దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో విజయ్‌ దేవరకొండ హీరోగా ఒక సినిమా పట్టాలు ఎక్కల్సి ఉంది.

కాని తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో కొత్త పుకార్లు షికార్లు చేస్తున్నాయి.సోషల్‌ మీడియాలో విజయ్ దేవరకొండ కొత్త మూవీ గురించి ప్రచారం జరగుతోంది.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో విజయ్‌ దేవరకొండ హీరోగా అర్జున్‌ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందబోతుందట.ఆ సినిమా ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేస్తున్న లైగర్ పూర్తి అయిన వెంటనే పట్టాలెక్కే అవకాశం ఉందని అంటున్నారు.

విజయ్ దేవరకొండ తో మైత్రి మూవీస్ వారు ఉన్నట్లుండి దర్శకుడి మార్చి సినిమాను ప్లాన్‌ చేయడం వెనుక ఉన్న కారణం ఏంటా అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.మైత్రి వారితో విజయ్‌ దేవరకొండ రెండు సినిమాలకు కమిట్ అయ్యాడా లేదంటే శివ నిర్వాన దర్శకత్వంలో సినిమా క్యాన్సిల్‌ అయ్యి అర్జున్‌ రెడ్డి ఫేం సందీప్ రంగంలోకి దిగాడా అనే విషయంలో క్లారిటీ లేదు.

మైత్రి వారితో శివ నిర్వాన మూవీ ఉందని మాత్రం తాజాగా జరిగిన ఉప్పెన ప్రీ రిలీజ్ వేడుకలో క్లారిటీ వచ్చింది.ప్రీ రిలీజ్‌ వేడుకలో శివ నిర్వాన పాల్గొన్నాడు.

దాంతో ఆ బ్యానర్‌ లో ఆయన సినిమా చేయబోతున్నట్లుగా తేలిపోయింది.కాని విజయ్‌ దేవరకొండతో శివ నిర్వాన మూవీ ఉందా లేదా అనే విషయంలో మాత్రం కొత్త అనుమానాలు పుట్టుకు వస్తున్నాయి.

ఈ విషయంలో విజయ్ దేవరకొండ అభిమానులు మైత్రి వారి అప్‌ డేట్‌ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube