విజయ్ దేవరకొండ మరో చిరంజీవి అవుతాడా..?

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషి కి కేరాఫ్ అడ్రస్.సినీ బ్యాక్ గ్రౌండ్ లో ఇండస్ట్రీ కి రావడం కాదు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎంతో మంది హీరోలకు బ్యాక్గ్రౌండ్ అయిపోయారు మెగాస్టార్ చిరంజీవి.

 Is Vijay Deverakonda Another Chiranjeevi, Chiranjeevi, Megastar Chiranjeevi, Vij-TeluguStop.com

అప్పటికే ఎన్టీఆర్ కృష్ణ ఇలాంటి వారు స్టార్ హీరోగా వెలుగొందుతున్న సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చి తన నటనతో డాన్సులతో సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేశారు చిరంజీవి.ఇక దాదాపు రెండు దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమ లో నెంబర్ వన్ హీరోగా కొనసాగారు.

ఇప్పటికి తిరుగులేని హీరోగా దూసుకుపోతున్నారు.అచ్చంగా ఇలా స్వయంకృషితో ఎదిగిన హీరోలు నేటి రోజుల్లో తక్కువగానే కనిపిస్తున్నారూ.

Telugu Chiranjeevi, Liger, Pan India Liger, Rowdy, Tollywood, Tollywoodtop-Movie

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు.ఇప్పుడు స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు అందరూ కూడా సినీ బ్యాక్ గ్రౌండ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వారే.కానీ సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి సొంత టాలెంట్ తో ఎదిగిన హీరో ఎవరైనా ఉన్నారంటే అందరూ చెప్పే పేరు విజయ్ దేవరకొండ. ఒక సాదాసీదా హీరోగానే ఎంట్రీ ఇచ్చాడు.

కానీ అర్జున్ రెడ్డి సినిమా తో ఒక్కసారిగా స్టార్ హీరో రేంజ్ సంపాదించాడు.గీత గోవిందం సినిమా తో 100 కోట్లు హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ.

టాలీవుడ్ లో ఉన్న టాప్ టెన్ హీరోలలో విజయ్ దేవరకొండ కూడా ఒకడిగా మారిపోయారు.

Telugu Chiranjeevi, Liger, Pan India Liger, Rowdy, Tollywood, Tollywoodtop-Movie

సినిమాల్లోనే కాదు తన ఆటిట్యూడ్తో కూడా యూత్ అందరినీ ఎంతగానో ఆకర్షించాడు.దీంతో విజయ్ క్రేజ్ ను క్యాష్ చేసుకుని సినిమాలు తీసేందుకు దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు.ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న లైగర్ ప్రాజెక్టులో నటిస్తున్నారు.

ఈ సినిమా ఊహించిన దాని కంటే మంచి విజయం సాధించింది అంటే విజయ్ దేవరకొండ స్టార్ డమ్ ఏ రేంజిలో పెరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇక బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ లాంటి వ్యక్తి లైగర్ కథను నమ్మి చేస్తున్నాడంటే కథలో బలం ఉండే ఉంటుంది.

ఇలా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చినా విజయ్ దేవరకొండ లైగర్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయే అవకాశం ఉంది.దీంతో చిరంజీవి తర్వాత ఇలా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చిన స్టార్ హోదా అందుకున్న హీరో గా మారిపోతాడు రౌడీ హీరో అని అంటున్నారు కొంతమంది విశ్లేషకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube