వయాగ్రా తో కరోనా కి చెక్ పెట్టోచ్చా...

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఎంతగా కలకలం సృష్టిస్తుందో పెద్దగా చెప్పనవసరం లేదు.దీంతో ఇప్పటికే పలు దేశాల్లో లాక్ డౌన్ విధించడమే కాకుండా ప్రజలను సామాజిక దూరం పాటిస్తూ అవసరమైతే తప్ప అనవసరమైన సమయాల్లో బయటికి రావద్దంటూ ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేస్తున్నాయి.

 Viagra Tablet, Corona Virus , Israel Country, Doctors, Corona Virus Medicine-TeluguStop.com

అయితే ఈ కరోనా వైరస్ మహమ్మారిని తరిమి కొట్టేందుకు ఇప్పటికే పలువురు వైద్య నిపుణులు మందులను కనిపెట్టే పనిలో పడ్డారు.

అయితే తాజాగా ఇజ్రాయెల్ దేశానికి చెందినటువంటి కొందరు వైద్యులు ఈ కరోనా వైరస్ ని తరిమి కొట్టేందుకు కొత్తగా పరిశోధనలో మొదలుపెట్టారు.

ఇందులో భాగంగా మనుషులు శృంగార శక్తి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఉపయోగించే వయాగ్రా ద్వారా కొంతవరకు కరోనా వైరస్ ని కట్టడి చేయవచ్చని కనుగొన్నారు.అంతేకాక వయాగ్రా ఉపయోగించడం వల్ల రక్తనాళాలకు ఆక్సిజన్ చక్కగా సరఫరా అవుతుందని అందువల్ల వ్యాధి నిరోధక కణాల సామర్థ్యం కూడా పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాక ఈ విషయంలో మరింత పురోగతి సాధించడం కోసం ఇజ్రాయిల్ దేశానికి చెందినటువంటి వైద్య పరిశోధకులు రాత్రింబవళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 20,72,228 కరోనా కేసులను గుర్తించగా ఇందులో 5 లక్షల పైచిలుకు మంది ఈ వైరస్ బారినుంచి కోలుకోగా, 1లక్ష 37 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

అయితే తాజాగా భారతదేశంలో నమోదైన కరోనా వైరస్ కేసుల గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే ఇప్పటివరకు దాదాపుగా 12,380 కేసులను వైద్యులు గుర్తించగా ఇందులో 1488 మంది కోలుకోగా దాదాపుగా 414 మంది ప్రాణాలు కోల్పోయారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube