గబ్బర్ సింగ్ హిట్ అవ్వడం వెనుక వెంకటేష్ కారణమా.. నిజమెంత?

టాలీవుడ్ స్టార్ హీరో దగ్గుబాటి వెంకటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.ఎన్నో క్లాస్, మాస్ సినిమాలలో నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

 Is Venkatesh The Reason Behind Gabbar Singh Being Movie Hit Is It Really, Gabbar-TeluguStop.com

ఇప్పటికి ఇండస్ట్రీలో కొనసాగుతూ వరుస సినిమాలలో దూసుకుపోతున్నాడు.ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది అభిమానులు ఉన్నారు.

ఇదిలా ఉంటే వెంకటేశ్ వల్ల గబ్బర్ సింగ్ హిట్ అని వార్తలు వినిపిస్తున్నాయి.ఇంతకు అసలు కారణం ఏంటో తెలుసుకుందాం.

వెంకటేష్ తొలిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి 1986లో కలియుగ పాండవులు సినిమాతో పరిచయం అయ్యాడు.ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించగా చంటి, బొబ్బిలి రాజా, కలిసుందాం రా, ప్రేమించుకుందాం వంటి పలు సినిమాలు మంచి గుర్తింపును అందించాయి.

దాదాపు 70 సినిమాలకు పైగా నటించాడు.ఈయన నటనకు పలు అవార్డులు కూడా అందాయి.

ఈయన సరసన నటించిన చాలామంది హీరోయిన్ లు తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమై మంచి హోదాను సంపాదించుకున్నారు.మళ్లీ మళ్లీ వెంకటేష్ సరసననే అవకాశాలు అందుకున్నారు.

ఇదంతా పక్కన పెడితే గబ్బర్ సింగ్ సినిమా హిట్ కావడానికి వెంకటేష్ కారణమని తెలుస్తుంది.ఇంతకు వెంకటేష్ కు గబ్బర్ సింగ్ సినిమాకు సంబంధం ఏంటో తెలుసుకుందాం.

Telugu Gabbar Singh, Pawan Kalyan, Tollywood, Venkatesh-Movie

2012లో మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా గబ్బర్ సింగ్.ఇక ఈ సినిమాను హిందీ సినిమా నుండి రీమేక్ చేయగా మంచి సక్సెస్ అందుకుంది.ఇక ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.అంతేకాకుండా ఈ సినిమాను బండ్ల గణేష్ నిర్మించాడు.ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించగా శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది.

ఇక ఈ సినిమా విమర్శకుల నుండి కూడా మంచి ఆదరణ అందుకుంది.

అంతేకాకుండా 63 కోట్లకు పైగా వసూలు అందుకుంది. నిజానికి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటించాడు కాబట్టే మంచి సక్సెస్ అందుకుందని చెప్పవచ్చు.

కానీ పవన్ కళ్యాణ్ కాకుండా మరే హీరో నటించిన కూడా ఈ సినిమా సక్సెస్ గురించి ఊహించుకోలేం.

కానీ ఈ సినిమా పవన్ కళ్యాణ్ కాకుండా తాను నటిస్తే మాత్రం అసలు హిట్ కాదని చెప్పాడు వెంకటేష్.

అవును ముందుగా ఈ సినిమాకు హీరోగా వెంకటేష్ ను రిఫర్ చేశాడట డైరెక్టర్.కానీ వెంకటేష్ ఈ పాత్ర తనకు సెట్ కాదని పవన్ కళ్యాణ్ కు బాగా సెట్ అవుతుంది అని తెలిపాడు.

దీంతో డైరెక్టర్ కు కూడా ముందుగా పవన్ కళ్యాణ్ అనే ఆలోచన రాలేదట.

Telugu Gabbar Singh, Pawan Kalyan, Tollywood, Venkatesh-Movie

వెంకటేష్ పవన్ కళ్యాణ్ పేరు అనడంతోనే ఇక డైరెక్టర్ కూడా పవన్ కళ్యాణ్ ను తీసుకున్నాడని తెలిసింది.మొత్తానికి గబ్బర్ సింగ్ సినిమా హిట్ కావడానికి కారణం వెంకటేష్ అనే చెప్పాలి.ఇక వెంకటేష్ ప్రస్తుతం వరుస సినిమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

అందులో ఎఫ్3, దృశ్యం 2 లు లైన్ లో ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube