బాబుకి షాకుల కాలం..పవన్ చెంతకి చేరనున్న..!!!!  

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి రోజుకో నేత చుక్కలు చూపిస్తున్నారు. బాబు ఒక పక్క ప్రజలని ఆకట్టుకోవడానికి ఎన్ని తయిలాలని ఇస్తున్నా సరే బాబు వెంట ప్రజలు ఉండరు అనే అభిప్రాయానికి దాదాపు పార్టీలో కీలక నేతలు అందరూ వచ్చేశారు. అందుకే గోడ దూకుళ్ళు కాస్త దూకుడుగానే ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. వైసీపీ నుంచీ తన పార్టీలోకి నేతలని జంప్ చేయించాలని చూస్తున్న బాబుకే ఇప్పుడు దిమ్మతిరిగే షాకులు తగులుతున్నాయి అనేట్టుగా ఉంది తాజాగా పరిస్థితి.

Is Vangaveeti Radha Joining In Pawan Kalyan Janasena-Janasena Party Kapu Vote Bank Pawan Janasena Tdp

Is Vangaveeti Radha Joining In Pawan Kalyan Janasena

గడిచిన కొన్ని రోజులుగా కోట్ల , తమ పార్టీలో చేరుతున్నారు , చర్చలు కూడా జరుగుతన్నాయి అనుకున్నారు అందరూ అయితే ఆమంచి కూడా టీడీపీ ని వీడి వైసీపీలో చేరుతారు అనే టాక్ వినిపించింది. అయితే ఈ ఇద్దరు ఇప్పుడు పక్కాగా వైసీపీలోకి వెళ్తారని జోరుగా ప్రచారం కూడా జరుగుతోంది. అయితే బాబు ఎంతగా ఇద్దరినీ బుజ్జగిస్తున్నా సరే ఉపయోగం లేదనేది వారి వాదన.ఇదిలాఉంటే ఉంటే..

వైసీపీ నుంచీ టీడీపీ లోకి జుంప్ చేయడానికి సర్వం సిద్దం చేసుకున్న వంగవీటి రాధా ఇప్పుడు ఆఖరి నిమిషంలో బాబు కి హ్యాండ్ ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తోంది. రంగా హత్యలో టీడీపీ హస్తం ఉందన్న ఆరోపణలకు బలమైన మద్దతు ఉంది. తండ్రిని చంపిన పార్టీగా ముద్రపడిన పార్టీలో రాధా చేరడం ఏ మాత్రం సహించలేమని అనుయాయులు అంటున్నారట. దాంతో ఇప్పుడు రాధా యూటర్న్ తీసుకునేపరిస్తితి ఏర్పడిందని తెలుస్తోంది.

Is Vangaveeti Radha Joining In Pawan Kalyan Janasena-Janasena Party Kapu Vote Bank Pawan Janasena Tdp

దాంతో ఇప్పుడు ఆలోచనలో పడిన రాధా జనసేనలోకి వెళ్ళడానికి రంగం సిద్దం చేసుకున్నాడు. రాధ సామజిక వర్గం , పవన్ సామాజిక వర్గం ఒక్కటి కావడంతో రాధా తానూ అనుకున్న ప్రాంతంలో పోటీ చేయడం వలన అన్ని విధాలుగా రాధాకి కలిసి వస్తుండటంతో తన మద్దతు దారులు కూగా జనసేనలోకి వెళ్ళమని ఒత్తిడి చేస్తున్నారట దాంతో రాధా జనసేనలోకి వెళ్ళడానికి దాదాపు డిసైడ్ అయినట్టే అంటున్నారు.

నోటి కాడ కూడు కాకులు తన్నుకు పోయినట్టుగా ఇప్పుడు తన పార్టీలో ముందు చేరుతారని హంగామా చేసిన నేతలు అందరూ ఇప్పుడు పక్క వైసీపీలో చేరడంతో బాబు కి మామూలు షాకులు తగలడం లేదని అంటున్నారు. మరి బాబు ఇంకెలాంటి వ్యుహలని రచిస్తారో వేచి చూడాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.