2024 ఎన్నికలకు సిద్దమేనా..క్లారిటీ ఇచ్చిన ట్రంప్..!!!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటమిని ఒప్పుకోవడానికి ససేమిరా అన్న ట్రంప్ మెల్ల మెల్లగా తన ఓటమిని అంగీకరిస్తున్నారు.ఎన్నికలలో అవక తవకలు జరిగాయంటూ మళ్ళీ పునః పరిశీలన చేయాలని కోర్టులలో వాజ్యాలు వేస్తున్న ట్రంప్ కు రోజు రోజుకి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి.

 Is Trump Ready For 2024 Elections?, Trump, 2024 U.s. Election, White House, Iva-TeluguStop.com

ట్రంప్ ఎలాగో ఓడిపోయారు అధ్యక్షుడు అయ్యే అవకాశం లేదు మరి మళ్ళీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారా అంటూ అనేక సందేహాలు వ్యక్తం చేశారు ఆయన అభిమానులు. సోషల్ మీడియా వేదికగా కూడా ట్రంప్ ను వివరణ అడిగారు.అయితే

అందరి ప్రశ్నలకు బదులు ఇస్తూ 2024 లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో తాను తప్పకుండా పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు ట్రంప్.నిన్నటి రోజున వైట్ హౌస్ లో ఏర్పాటు చేసిన హాలిడే రిసెప్క్షన్ లో ట్రంప్ పాల్గొన్నారు.2024 లో తానూ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి అన్నట్టుగా సంకేతాలు ఇచ్చారు.ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ గడించిన 4 ఏళ్ళు ఎంతో బాగా గడించాయి, మరో నాలుగేళ్ళు అధికారం కోసం ఎంతగానో శ్రమిస్తున్నాము.అయితే

Telugu Trump Ready, Ivanka, Joe Biden, Kamala, Trump, White-Telugu NRI

నా శ్రమ గనుకా వృధా అయితే నాలుగేళ్ళు మిమ్మల్ని చూస్తూనే ఉంటానని ట్రంప్ తెలిపారు.ఈ లెక్కలో ఒక వేళ ట్రంప్ తన పదవి నుంచి వైదొలగిన ప్రతిపక్ష హోదాలో ప్రజలకు దగ్గరగా ఉంటాననే సంకేతాలు మాత్రం ఇచ్చారు.కాగా అధ్యక్ష పదవి నుంచి ట్రంప్ తప్పుకున్న తరువాత ఆయన శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటారని, ఇక రాజకీయాల జోలికే రారని అనుకున్న తరుణంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలతో మళ్ళీ 2024 ఎన్నికలకు ట్రంప్ తప్పకుండ పోటీ చేస్తారనే క్లారిటీ మాత్రం వచ్చిందని అంటున్నారు నిపుణులు.అయితే ట్రంప్ రాజకీయాల్లో కొనసాగడానికి కారణం తన కూతురు ఇవాంకా రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేయడానికేనని అంటున్నారు విశ్లేషకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube