మీరు ట్రూ కాలర్‌ వాడుతున్నారా, అయితే ఇది తప్పకుండా చదవండి  

Is Truecaller Safe And Accurate To Use-truecaller,truecaller Features

ప్రస్తుతం టెక్నాలజీ ఏ స్థాయిలో పెరిగిందో ప్రతి ఒక్కరికి తెల్సిందే. ఒకప్పుడు ఫోన్‌లు కేవలం మాట్లాడుకోవడానికే పని చేసేవి. ఆ తర్వాత మెసేజ్‌లు చేసుకునే విధంగా మారాయి..

మీరు ట్రూ కాలర్‌ వాడుతున్నారా, అయితే ఇది తప్పకుండా చదవండి-Is Truecaller Safe And Accurate To Use

సెల్‌ఫోన్‌లు అనూహ్యంగా మార్పులు చెందుతూ వస్తున్నాయి. ప్రస్తుతం మొబైల్‌ ఫోన్‌లు 4జీ టెక్నాలజీతో వినియోగదారులకు అందిస్తున్న సేవలు అన్నీ ఇన్నీ కావంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అద్బుతమైన సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చిన 4జీ జనాలను ఆశ్చర్యపర్చుతూ టెక్నాలజీని తీసుకు వచ్చింది. ముఖ్యంగా మొబైల్‌ వినియోగదారులు ఎక్కువగా వినియోగిస్తున్న యాప్‌ ట్రూ కాలర్‌.

ఈ ట్రూకాలర్‌ వల్ల అవతలి నుండి వస్తున్న ఫోన్‌ ఎవరిది అనే విషయం తెలుసుకోవచ్చు.

అంటే మన ఫోన్‌లో నమోదు అవ్వని ఫోన్‌ నెంబర్‌ నుండి కాల్‌ వస్తున్న సమయంలో ఆ ఫోన్‌ నెంబర్‌ ఎవరిది అనే విషయాన్ని మొదటే ట్రూ కాలర్‌ చెప్పేస్తుంది. తెలియని నెంబర్స్‌ నుండి కాల్స్‌ వస్తున్న సమయంలో ఆ నెంబర్‌ గురించిన విషయాలను ఈ ట్రూకాలర్‌ చెబుతుంది. అది ఏ ప్రాంతంది, అది ఏ వ్యక్తికి చెందినది అన్నట్లుగా చెప్పుకొవచ్చు.

అందుకే అత్యధికులు ట్రూ కాలర్‌ను వినియోగిస్తున్నారు.

వినియోగదారులకు అద్బుతమైన ఫీచర్స్‌ను అందిస్తున్న ట్రూ కాలర్‌ గురించి మొదటి నుండే టెక్కీలు హెచ్చరిస్తున్నారు. చైనాకు చెందిన ఈ యాప్‌ వల్ల వైరస్‌ ఎటాక్‌ అవుతుందని ఆమద్య చెప్పుకొచ్చారు. ఇప్పుడు ట్రూ కాలర్‌ డేటా మొత్తం దొంగిలించబడిందట.

కోట్లాది మంది డేటా దొంగిలించబడిందని టెక్కీలు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 50 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. అందులో 60 నుండి 70 శాతం మంది వినియోగదారుల డేటా చోరీకి గురైందట. అందులోని ప్రతి ఒక్కరి మొబైల్‌ నెంబర్‌, పేరు, మెయిల్‌ ఐడీలు చోరీ అయ్యాయి..

ఆన్‌ లైన్‌లో కేవలం లక్షన్నర రూపాయలకే ట్రూ కాలర్‌ డేటాను పొందే విధంగా కొందరు ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది. అందుకే ట్రూ కాలర్‌ ఎంత మాత్రం మంచిది కాదని వివిధ దేశాలు బ్యాన్‌ చేశాయి.

కాని ఇండియాలో మాత్రం పెద్ద ఎత్తున వినియోగదారులు ట్రూకాలర్‌ను వినియోగిస్తున్నారు. మొత్తం వినియోగదారుల్లో 65 శాతం మంది ఇండియన్స్‌ అవ్వడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. అంటే ఇండియన్స్‌కు చెందిన ఎక్కువ శాతం డేటా చోరీ అయ్యిందని సమాచారం అందుతోంది. అందుకే ట్రూ కాలర్‌తో జర జాగ్రత్తగా ఉండండి..

చైనాకు చెందిన యాప్‌ అవ్వడం వల్ల ఇండియాలో దీన్ని తగ్గించాలని కొందరు పిలుపునిస్తున్నారు. కొందరు మాత్రం పట్టించుకోకుండా పనిగట్టుకుని దాన్నే వాడేస్తున్నారు.