కాంగ్రెస్ ట్రాప్ లో హరీష్ రావు ఇరుక్కున్నాడా ...?  

ఎత్తులు పై ఎత్తులు అనేవి రాజకీయాల్లో సర్వసాధారణం. ఎన్నికల సమయంలో వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తేనే ప్రత్యర్థులు బలహీన పది విజయం సునాయాసంగా దక్కుతుంది. ఇక తెలంగాణ రాజకీయాల్లో బలంగా ఉన్న అధికార పార్టీ టీఆర్ఎస్ ను ఇరుకునపెట్టడమే కాకుండా బలమైన … తిరుగులేని నాయకుడిగా ఉన్న హరీష్ రావు హవా తగ్గించి టీఆర్ఎస్ ప్రభావం కొంతమేర అయినా తగ్గించాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. అందుకే హరీష్ మీద అనేక అనేక ఆరోపణలు గుప్పిస్తూ ఆయన్ను ఆత్మరక్షణలో పడేస్తోంది. అంతే కాదు కాంగ్రెస్ ఆరోపణల్లో నిజం ఉన్నా .. లేకపోయినా … టీఆర్ఎస్ అగ్ర నాయకత్వం మాత్రం హరీష్ వైపు అనుమానంగానే చూస్తున్నారు.

Is True That Congress Party Manipulating To Harish Rao-

Is True That Congress Party Manipulating To Harish Rao

సిద్ధిపేట నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చుకున్న హరీష్ … అక్కడ తాను పోటీ చేయకపోయినా గెలుస్తాను అనే ధీమాతో… కేసీఆర్ కి భారీ మెజార్టీ తెచ్చేందుకు అన్నట్టుగా … గజ్వేల్ లో ఎక్కువగా తిరుగుతున్నాడు. అయితే కాంగ్రెస్ మాత్రం హరీష్ ఇక్కడ మకాం వేసింది కేసీఆర్ ను గెలిపించడానికి కాదు.. ఓడించడానికి అంటూ కాంగ్రెస్ అభ్యర్తి ప్రతాప్ రెడ్డి ఆరోపణలు చేసాడు. ఆయనే కాదు… వరంగల్ టీడీపీ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా ఇటువంటి ఆరోపణలే చేశారు. ఈ వ్యాఖ్యలతో మరింత రగిలిపోయిన హరీష్ గజ్వేల్ లో కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా రాకుండా చేస్తాను అంటూ సవాల్ విసిరాడు.

Is True That Congress Party Manipulating To Harish Rao-

హరీష్ ను ఇరకాటంలో పడేయడం ద్వారా… ఆయన స్పీడ్ తగ్గుంతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఎందుకంటే.. హరీష్ రావు గొప్ప. రాజకీయ వ్యూహకర్త. ఆయన బాధ్యతలు తీసుకున్న చోట ఎలాగైనా గెలుపు తెప్పించి పెడతారు. అందుకే.. ఆయనను వీలైనన్ని తక్కువ నియోజకవర్గాలకు పరిమితమయ్యేలా చూడాలని కాంగ్రెస్ స్కెచ్ వేసిందని. దానికి తగ్గట్లుగానే ఆరోపణలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. హరీష్ కూడా కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టుగానే… గజ్వేల్‌కే పరిమిమతవుతున్నారు. నిజానికి.. ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు.. మహబాబ్ నగర్ జిల్లాలోని కొన్నికీలక స్థానాల బాధ్యతను.. కేసీఆర్ హరీష్ రావుకు అప్పగించారు. అందులో గజ్వేల్ ఉంది.. కొడంగల్ కూడా ఉంది. గజ్వేల్‌లో కేసీఆర్ గెలుపు ఎంత ముఖ్యమో.. కొడంగల్‌లో.. రేవంత్ రెడ్డి ఓటమి కూడా హరీష్ కు అంటే ముఖ్యం. కానీ ఆయన మీద వస్తున్న ఈ ఆరోపణలతో వేరే నియోజకవర్గాలపై దృష్టిపెట్టలేకపోతున్నాడు. అంటే.. కాంగ్రెస్ ప్లాన్ వర్కవుట్ అవుతున్నట్టే కనిపిస్తోంది.