బిగ్‌బాస్‌లో నూతన్‌ నాయుడు రీ ఎంట్రీ.. ఇది ఎంత వరకు నిజం

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 2 నుండి రెండవ వారం ఎలిమినేట్‌ అయిన నూతన్‌ నాయుడు గురించి మీడియాలో పలు రకాల పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి.ఇటీవలే ఈయన బిగ్‌బాస్‌కు వెళ్లేందుకు నాలుగు కోట్లు ఖర్చు చేశాడు అంటూ టాక్‌ వచ్చింది.

 Is True Nutan Naidu Entering Into Bigg Boss-TeluguStop.com

బిగ్‌బాస్‌ నిర్వాహకులకు ఏకంగా నాలుగు కోట్ల రూపాయలను ఈయన ఆఫర్‌ చేయడం జరిగిందని, ఆ ఆఫర్‌కు ఓకే చెప్పిన బిగ్‌బాస్‌ నిర్వాహకులు ఆయన్ను ఎంపిక చేయడం జరిగింది అంటూ పుకార్లు షికార్లు చేశాయి.ఆ వార్తలపై తాజాగా నూతన్‌ నాయుడు మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

బిగ్‌బాస్‌లోకి వెళ్లేందుకు తాను ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు అని, తనకు ఆ అవసరం కూడా లేదు అంటూ చెప్పుకొచ్చాడు.బిగ్‌బాస్‌లో నూతన్‌ నాయుడు గురించి మళ్లీ కొత్త వార్తలు పుట్టుకు వచ్చాయి.

గత కొన్ని రోజులుగా నూతన్‌ నాయుడు ఎలిమినేషన్‌ గురించి సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతుంది.నూతన్‌ నాయుడు బిగ్‌బాస్‌ ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందంటూ తాజాగా ఒక పోల్‌ ట్విట్టర్‌లో పెట్టడం జరిగింది.

ఆ పోల్‌కు అనూహ్యంగా స్పందన దక్కింది.ఏకంగా 90 శాతం మంది నూతన్‌ నాయుడుకు మద్దతుగా నిలిచారు.

అందుకే నూతన్‌ నాయుడును మళ్లీ తీసుకోవాలనే ఉద్దేశ్యంతో స్టార్‌ మాటీవీ వారు ఉన్నట్లుగా తెలుస్తోంది.

నూతన్‌ నాయుడును వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా షోకు తీసుకోవడంతో కొత్త ఉత్సాహం షోకు వస్తుందనే టాక్‌ వినిపిస్తుంది.ఇక సామాన్యులను ముగ్గురిని తీసుకుని వారిలో ఇద్దరిని ఇప్పటికే ఎలిమినేట్‌ చేసిన బిగ్‌బాస్‌ నిర్వాహకులు విమర్శల పాలు అయ్యారు.అందుకే ఇప్పుడు నూతన్‌ నాయుడును ఎంపిక చేయడం వల్ల ఆ విమర్శలకు సమాధానం చెప్పినట్లు అవుతుందనే టాక్‌ వినిపిస్తుంది.

మొత్తానికి బిగ్‌బాస్‌లో ఏదో సంచలనం జరిగే అవకాశం ఉందని విశ్వసనీయంగా సమాచారం అందుతుంది.

ఇక మరోవైపు బిగ్‌బాస్‌లోకి హెబ్బా పటేల్‌ను వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటూ గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

మరి బిగ్‌బాస్‌ ఇంట్లోకి వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా హెబ్బా వెళ్తుందా లేదంటే నూతన్‌ నాయుడు వెళ్తాడా అనేది చూడాలి.నాని హోస్ట్‌గా ప్రసారం అవుతున్న బిగ్‌బాస్‌కు మూడు వారాలుగా మంచి టీఆర్పీ రేటింగ్‌ వస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube