బాబోయ్‌.. ఆది అంతగా సంపాదిస్తున్నాడా?  

తెలుగు ప్రేక్షకులకు ప్రస్తుతం హైపర్‌ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. జబర్దస్త్‌లోని తన పంచ్‌ డైలాగ్స్‌తో, అద్బుతమైన స్కిట్స్‌తో అదరగొడుతున్న ఆది సినిమాల్లో కూడా మెల్ల మెల్లగా బిజీ అవుతూ ఉన్నాడు. గత కొన్ని వారాలుగా హైపర్‌ ఆది జబర్దస్త్‌ షోలో కనిపించడం లేదు. తిరిగి వస్తాడా లేదంటే సినిమాలతోనే బిజీగా ఉంటాడో అనే విషయంపై క్లారిటీ అయితే లేదు. కాని ఆది జబర్దస్త్‌ కారణంగా బాగా సంపాదించాడని, ఇంకా బాగానే సంపాదిస్తున్నాడంటూ సమాచారం అందుతుంది.

Is True Hyper Aadi Earning Too Much Amount-

Is True Hyper Aadi Earning Too Much Amount

ఆదిది సొంత ఊరు ప్రకాశం జిల్లా చికుమర్తి మండలం పల్లాం గ్రామం. ఒక మారుమూల గ్రామంలో చదువుకున్న ఆది ప్రస్తుతం పెద్ద సెలబ్రెటీ అయ్యాడు. ఉద్యోగం కోసం హైదరాబాద్‌ వచ్చిన ఆది 25 వేల ఉద్యోగం కోసం ఎన్నో కంపెనీల చుట్టు తిరిగాడు. కాని ఆయన అడుగు పెడితే పాతిక లక్షలు అంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఆది ఏదైనా సినిమాలో నటిస్తే మినిమం 25 లక్షల పారితోషికం తీసుకుంటాడట. ఆది సంపాదన ఏ రేంజ్‌ లో ఉందో ప్రస్తుతం బుల్లి తెర వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Is True Hyper Aadi Earning Too Much Amount-

ఇప్పటి వరకు జబర్దస్త్‌ ద్వారా ఎంతో మంది గుర్తింపు దక్కించుకున్నారు, స్టార్స్‌ అయ్యారు. కాని ఆది సంపాదించినంతగా మాత్రం ఏ ఒక్కరు సంపాదించడం లేదు అనేది అంతా ఒప్పుకుంటున్నారు. తాజాగా సొంత ఊరు పల్లాంలో ఆది రెండు కోట్లు పెట్టి పొలం కొన్నాడట. అంతకు ముందే మడికొండలో అపార్ట్‌మెంట్‌ లో ప్లాటు, హైదరాబాద్‌ శివారులో ల్యాండ్స్‌ ఇంకా ఖరీదైన కారు, బంగారం కొనుగోలు చేసినట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మొత్తానికి ఆదిని జబర్దస్త్‌ మార్చి పారేసింది.