చంద్రబాబు చాణిక్యం బెడిసి కొడుతోందా.వయసు మీద పడుతున్న కొద్దీ బాబు గారి అనుభవం పిల్లి మొగ్గలు వేస్తోందా.?? కాంగ్రెస్ పార్టీతో చేయి చేయి కలపడానికి గల కారణం ఏమిటి.అసలు బాబు పనైపోయిందా.??చంద్రబాబు కాంగ్రెస్ కలయిక తో ఎన్నో అనుమానాలు మరెన్నో జవాబు లేని ప్రశ్నలు ముఖ్యంగా టీడీపీ నేతలని కలిచివేస్తున్నాయి… కాంగ్రెస్ తో కలవడానికి అసలు రీజన్ ఎంటిటీ బాబుగారి వ్యూహం ఏమిటి.40 ఏళ్ల సుదీర్ఘమైన రాజకీయ జీవితం ఉన్న బాబు తడబడుతున్నారా.??
గడిచిన కొన్ని రోజులుగా చంద్రబాబు ని నిశితంగా పరిశీలిస్తే చాలా మందికి కొన్ని ధర్మ సందేహాలు రాక మానదు.ఢిల్లీ టూర్ లలో చేస్తున్న హడావిడి ,మీడియాని మేనేజ్ చేసుకుంటూ తెచ్చిపెట్టుకుంటున్న కీర్తి ప్రతిష్టలు.తానొక్కడే జాతీయ స్థాయిలో బీజేపీ కి చుక్కలు చూపిస్తున్నట్టుగా.బీజేపీ వ్యతిరేక శక్తులని ఒకే తాటిచెట్టుపై కూర్చే పెట్టేవాడిలా ఇస్తున్న హడావిడి ఇదంతా ఎందుకు.?? అసలు బాబు అంతరంగం ఏమిటి.?? ఎందుకు అక్కర్లేని పనికి తనది కానీ పనిని భుజాన వేసుకుని మరీ భారత దేశాన్ని కాపాడుకోవాలని అంటూ కవరింగ్ ఇస్తూ.అసలు ఎందుకిలా…??
ఎందులకంటే అంటూ విశ్లేషకులు చెప్తున్న వివరాల ప్రకారం… ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు బీజేపీ ని బద్ధ శత్రువు గా చూసారు.జాతీయస్థాయిలో నిరసన తెలుపుతూ బిజెపిని ఎండగట్టే ప్రయత్నం చేశారు…ఎప్పుడైతే బీజేపీని వీడి బాబు బయటకు వచ్చారో అప్పుడే బీజేపీ తనకి ముహూర్తం పెడుతుందని ఫిక్స్ అయిపోయిన బాబు ప్రత్యామ్నాయం కోసం కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇదిలాఉంటే ఒకపక్క జగన్ కి పెరుగుతున్న ప్రజాదరణ.మరో పక్క జనసేనాని వెల్లువలా వస్తున్న జనాభిమానం.చంద్రబాబు లో మరింత అభద్రతా భావాన్ని పెంచుతున్నాయని.తన కుమారుడు లోకేష్ ఆశించిన స్థాయిలో రాజకీయాల్లో రాణించలేక పోవడం కూడా బాబు ని మానసికంగా ఇబ్బంది పెడుతున్న అంశమని అంటున్నారు…సొంత సర్వేలు కూడా బాబు అధికారం లోకి రావడం కష్టమని తేల్చేశాయట.
దాంతో బాబు భవిష్యత్తుపై మరింత బెంగ పెట్టుకున్నారట.మరో పక్క కేంద్రంలో మరో సారి బీజేపీ వస్తే తానూ జైలుకి వెళ్లడం ఖాయమని తెలిసిన బాబు అందుకు తగ్గట్టుగానే కాంగ్రెస్ తో చెలిమి చేస్తూ జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల కూటమి కలయిక బాధ్యతలని నెత్తిన పెట్టుకున్నారని అంటున్నారు రాజకీయ పండితులు.