పుట్ట మధుపై వేటుకు టీఆర్ఎస్ అధిష్టానం రంగం సిద్ధం చేస్తోందా?

తెలంగాణలో రాజకీయాల హాట్ హాట్ గా ఉన్నాయి.అయితే ఈటెల వ్యవహారం ముగియక ముందే పుట్ట మధు అదృష్యమైన వార్త రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.

 Is Trs Party Is Going To Suspend Putta Madhu For The Party-TeluguStop.com

వామనరావు దంపతుల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పుట్టమధు ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించడంతో పుట్టమధు గన్ మెన్ లకు కూడా చెప్పకుండా విచారణ నుండి తప్పించుకోవడం కోసం వారం రోజులు తన జాడ తెలియకుండా జాగ్రత్త పడ్డాడు.అయితే పుట్ట మధు కోసం గాలింపు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు భీమవరంలో పట్టుకున్నారు.

అయితే తనను విచారణ చేస్తున్నారు కాబట్టి అదృశ్యమయ్యానని నిజం ఒప్పుకున్నాడు.అయితే మంత్రి ఈటెల ప్రధాన అనుచరుడైన పుట్ట మధు ఈటెలకు సహకరిస్తున్నాడని కేసీఆర్ కు సమాచారం రావడంతో పుట్ట మధును టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.

 Is Trs Party Is Going To Suspend Putta Madhu For The Party-పుట్ట మధుపై వేటుకు టీఆర్ఎస్ అధిష్టానం రంగం సిద్ధం చేస్తోందా-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక మరి వామనరావు హత్య కేసును తిరిగి విచారణ ప్రారంభించడంతో పుట్ట మధును కూడా పార్టీ నుండి సస్పెండ్ చేస్తారా అన్నది ఉత్కంఠగా మారింది.అయితే ఇప్పటివరకు పుట్ట మధు వ్యవహారంపై అధికారికంగా టీఆర్ఎస్ నేతలు స్పందించకపోయినా పోలీసుల విచారణలో దోషిగా తేలితే పార్టీ పరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

మరి ఈటెల తరువాత పుట్ట మధు వ్యవహారం హాట్ టాపిక్ గా మారడంతో ఏ క్షణం ఏం జరుగుతుందేమో నని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పరిస్థితి ఉంది.

#Putta Madhu #PuttaMadhu #Etela Rajender #Trs Party #VamanRao

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు