హుజూర్ నగర్ లో 'ఎర్ర గులాబీ' వికసిస్తుందా ?

తెలంగాణలో హోరాహోరీగా జరగబోతున్న హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రతి పార్టీ తమ శక్తియుక్తులను కూడగట్టుకుని ప్రచారానికి దిగుతున్నాయి.ఈ ఉపఎన్నిక ప్రతి పార్టీకి ప్రతిష్టాత్మకం కావడంతో పాటు రాబోయే రోజుల్లో ఆ పార్టీల ఎదుగుదలకు ప్రధాన కారణంగా నిలిచే అవకాశం ఉండడంతో గెలుపుకోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి.

 Is Trs And Cpi Tie Up Will Workin Huzurnagar-TeluguStop.com

ఇక అధికార టిఆర్ఎస్ పార్టీ ఈ స్థానాన్ని గెలుచుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది.తెలంగాణలో తమ ఇజం మావోయిజం అని అసలు ఎర్రజెండా లకు అవకాశమే లేదని చెప్పుకున్న టిఆర్ఎస్ నాయకులు ఇప్పుడు మాత్రం హుజూర్ నగర్ లో తమకు సహాయ సహకారాలు అందించాలని వామపక్ష పార్టీలను వేడుకుంటూ వారి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

Telugu Huzurnagar, Telangana, Trs Cpi Tie-Telugu Political News

ఎర్ర పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు కెసిఆర్ కు ఇష్టం లేకపోయినా గెలుపు తప్పనిసరి కావడంతో వారి మద్దతు కోసం ఒక మెట్టు దిగేందుకు కూడా కేసీఆర్ సిద్ధపడ్డాడు.ఈ నేపథ్యంలో సిపిఐ పార్టీ టిఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డికి తమ సంపూర్ణ మద్దతుతో పాటు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు.అయితే ఇప్పటి వరకు టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ వచ్చిన సిపిఐ ఇప్పుడు అకస్మాత్తుగా మద్దతు ప్రకటించడంపై నా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అయితే సీపీఐ పొత్తు వలన అధికారపార్టీకి ఏ మేరకు ప్రయోజనం ఉండబోతుంది అనేది ఇప్పుడు తెర మీదకు వస్తోంది.

హుజూర్ నగర్ లో సిపిఐకు బలమైన ఓటు బ్యాంకు ఉంది.తెలంగాణ సాయుధ పోరాటంలో ముఖ్య పాత్ర పోషించిన సాయుధ పోరాటానికి చెందిన నేతల వారసులు సిపిఐ మద్దతు దారులుగా ఉన్నారు.

Telugu Huzurnagar, Telangana, Trs Cpi Tie-Telugu Political News

అదీ కాకుండా ఈ నియోజకవర్గంలోని చింతలపాలెం, మేళ్లచెరువు, హుజూర్ నగర్, నేరేడుచర్ల, గరిడేపల్లి, తదితర మండలాల్లో సిపిఐ పార్టీ కి బలమైన, చురుకైన నాయకత్వం ఉంది.ఒక రకంగా చెప్పాలంటే పార్టీల గెలుపోటములు ప్రభావితం చేసే స్థాయిలో ఇక్కడ సీపీఐ ఉంది.దీని కారణంగానే నియోజకవర్గ ఎన్నికల బాధ్యతలు చూస్తున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి సూచనల మేరకు సీఎం కేసీఆర్ సీపీఐ నాయకులతో మంతనాలు జరిపి వారిని ఒప్పించినట్లు తెలుస్తోంది.ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు తో పాటు పొలిట్ బ్యూరోలోని కొంతమంది ద్వారా కెసిఆర్ రాయబారం నడిపించినట్టు సమాచారం.సిపిఐ బలంతో తాము ఈ ఎన్నికల్లో గెలుపు జెండా ఎగురవేస్తామనే ధీమా అప్పుడే అధికార పార్టీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

అయితే ఇది ఎంత మేరకు కలిసి వస్తుందో అనేది వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube