టాలీవుడ్.బాలీవుడ్ తర్వాత అత్యంత విశాలమైన సినీ పరిశ్రమ.
టాలీవుడ్ సినిమాలు చేసేందుకు బాలీవుడ్ జనాలు సైతం ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు.చాలా మంది ముంబై నుంచి టాలీవుడ్ లోకి దిగుమతి అయిన కళాకారులున్నారు.
చాలా కాలంగా మిగతా సినిమా పరిశ్రమ నటులు ఇక్కడ నటించడం కామన్ అయ్యింది.హీరోయిన్లలో 90 శాతం మంది ముంబై నుంచి వచ్చిన వారే.
పలువురు విలన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా అక్కడి నుంచే వచ్చారు.వస్తున్నారు కూడా.
చాలా మంది తెలుగు సినిమా పరిశ్రమపై ప్రశంసలు కురిపిస్తున్నారు.కానీ ప్రస్తుతం జరిగిన మా ఎన్నికలు తెలుగు సినిమా పరిశ్రమకు అంత విశాల హ్రుదయం ఏమీ లేదని నిరూపించిందంటున్నారు పలువురు సినీ విమర్శకులు.
ఇంతకీ దీనికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మా ఎన్నికల్లో అధ్యక్ష పీఠం కోసం బరిలోకి దిగిన ప్రకాష్ రాజ్ ఇదే విషయంపై పలు కామెంట్స్ చేశాడు.
తెలుగు సినిమా పరిశ్రమలో ప్రాంతీయవాదం అణువు అణువునా నెలకొని ఉందని ఆరోపించాడు.ఆయన మాట్లాడినట్లుగానే పలువురు సినీ తారలు ప్రకాష్ రాజ్ ఇక్కడి వాడు కాదని.మా అధ్యక్షుడిగా ఆయన కొనసాగేందుకు అర్హత లేదు అనేలా చాలా మంది ప్రవర్తించారు.ఓ జాతీయ స్థాయి నటుడిగా వెలుగొందుతున్న ఆయన.ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు చేయడం చాలా ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది.ఎంతో మంది వేరే భాష నటులకు అవకాశాలు ఇచ్చే టాలీవుడ్.
ప్రస్తుతం మా ఎన్నికల పుణ్యాన అపకీర్తి మూటగట్టుకుంది.
వాస్తవం ఏంటంటే.వందేళ్ల సినిమా పండుగకు రెడీ అవుతున్న టాలీవుడ్ మీద ప్రాంతీయవాదం అనే మచ్చ పడటం మంచిది కాదు అంటున్నారు చాలా మంది సినీ విమర్శకులు.అయితే ఓటమి చెందినంత మాత్రాన టాలీవుడ్ పై విమర్శలు చేయడం మంచిది కాదని పలువురు ప్రకాష్ రాజ్ కు హితవు పలుకుతున్నారు.
గెలుపోటములు సహజం అంటున్నారు.ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన విమర్శలు సరికాదంటున్నారు.