టీడీపీ రాజ‌కీయాలు చ‌క్క‌బెట్ట‌డం ఆమెకు సాధ్య‌మేనా...!

తాజాగా టీడీపీ నియ‌మించిన పార్ల‌మెంట‌రీ జిల్లాల క‌మిటీల్లో అన్ని సామాజిక వ‌ర్గాల‌ను సంతృప్తి ప‌రిచేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించారు.ఈ క్ర‌మంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వ‌ర్గాల‌కు కూడా న్యాయం చేశారు.

 Is Thota Seetharama Lakshmi Will Set Tdp Politics,andhra Pradesh, Tdp, Narasapur-TeluguStop.com

ఇంత వ‌ర‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాలు, కొంద‌రు నేత‌ల విష‌యంలో మాత్రం బాబు అనుస‌రించిన వైఖ‌రిపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

వ్యూహం లోపించేదేమో.అనే సందేహాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇలాంటి వాటిలో.న‌ర‌సాపురం పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్‌గా నియ‌మితులైన సీనియ‌ర్ నాయ‌కురాలు తోట సీతారామ‌ల‌క్ష్మి విష‌యం చ‌ర్చ‌కు వ‌స్తోంది.

నిజానికి సీతారామ‌ల‌క్ష్మి సీనియ‌రే.ఉమ్మ‌డి ప‌శ్చిమ జిల్లాలో పార్టీ ప‌గ్గాల‌ను సుదీర్ఘ‌కాలం నిర్వ‌హించారు.అదే స‌మ‌యంలో రాజ్య‌స‌భ స‌భ్యురాలిగా కూడా మంచి ప‌రిణ‌తి చూపించారు.ఈ విష‌యంలో సందేహం లేదు.

అయితే, న‌ర‌సాపురం వంటి కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గంలో ఆమెకు బాధ్య‌త‌లు అప్ప‌గించడ‌మే ప్ర‌శ్న‌ల‌కు తావిస్తోంది.దీనికి కార‌ణం.

ఆమెకు ఇక్క‌డ వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌బెట్ట‌డం అస్స‌లు ఇష్టం లేదు.అయిన‌ప్ప‌టికీ.

చంద్ర‌బాబు బ‌లవంతంగా ఆమెకు ఇక్క‌డి ప‌గ్గాలు ఇచ్చారు.

ఇక‌, నియోజ‌క‌వ‌ర్గం ప‌రంగా చూసుకున్నా.

క్ష‌త్రియ సామాజిక వ‌ర్గానికి ప్రాధాన్యం ఉంది.మ‌రీముఖ్యంగా అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్షం టీడీపీల్లో క్ష‌త్రియ సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా ఉంది.

అలాంటి నియోజ‌క‌వ‌ర్గంలో కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన సీతారామల‌క్ష్మికి ఇక్క‌డి బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే.ఆమె ఏమేర‌కు ఇక్క‌డ పుంజుకుంటుంది? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌.పైగా టీడీపీకి చెందిన క‌లువ‌పూడి శివ‌, మంతెన రామరాజు వంటివారు ఇక్క‌డ బ‌లంగా ఉన్నారు.ఇలాంటి వారిని కాద‌ని. సీతారామ‌ల‌క్ష్మికి ప‌గ్గాలు అప్ప‌గిస్తే.వారు ఈమెతో క‌లివిడిగా ఉండ‌గ‌ల‌రా? అనేది మ‌రో ప్ర‌ధాన ప్ర‌శ్న‌.

వైసీపీ త‌రపున చ‌క్రం తిప్పుతున్న మంత్రి రంగ‌నాథ‌రాజు హ‌వాను కూడా బ‌లంగా ఎదుర్కొన‌గ‌ల‌గాలి.ఇక‌, కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో దూకుడు చూపించాలి. కేవ‌లం కాపులే కాకుండా క్ష‌త్రియ వ‌ర్గాన్ని కూడా క‌లుపుకొని పోవాలి.కానీ, ఇవ‌న్నీ సీతారామ‌ల‌క్ష్మి ఏమేర‌కు సాధించ‌గ‌ల‌రు? అనేది క‌ష్ట‌మేన‌ని అంటున్నారు త‌మ్ముళ్లు.మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube