ప్ర‌కృతి అందం అంటే ఇదేనా.. క‌వ్వంతో చిలికిన‌ట్టు విహ‌రిస్తున్న మేఘాలు

Is This What Natural Beauty Is All About Clouds Swirling With Bitterness

ఈ సృష్ఠి  అందాల‌ను చూడాలంటే రెండు కండ్లు అస్స‌లు స‌రిపోవేమో.అత్యంత స‌హ‌జ సిద్ధంగా ఏర్ప‌డే అందాలు కనుల విందును చేస్తాయి.

 Is This What Natural Beauty Is All About Clouds Swirling With Bitterness-TeluguStop.com

అయితే అవి ఎక్క‌డ బ‌డితే అక్క‌డ ఉండ‌వు.అవి ఉండే చోట ఉండే వారికి నిత్యం అందాల విందు అనే చెప్పాలి.

వాట‌ని చూస్తున్నంత సేపు మ‌న‌సు హాయిగా అనిపిస్తుంది.అన్ని టెన్ష‌న్లు మ‌ర్చిపోతాం.

 Is This What Natural Beauty Is All About Clouds Swirling With Bitterness-ప్ర‌కృతి అందం అంటే ఇదేనా.. క‌వ్వంతో చిలికిన‌ట్టు విహ‌రిస్తున్న మేఘాలు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వాటి ద‌గ్గ‌ర ఎంజాయ్ చేసిన గురుతుల‌ను జాగ్ర‌త్త‌గా దాచుకుంటాం.ఇలాంటి అందాల‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట బాగానే వైర‌ల్ అవుతుంటాయి.

వాటిని చూసిన నెటిజ‌న్లు కామెంట్ల‌తోనే త‌మ ఆనందాన్ని పంచుకుంటారు.

ఇక ఆకాశంలో మేఘాలు మ‌న‌కు చాలా దూరంగా ఉంటాయి క‌దా.

కానీ ఇవి కూడా కొన్ని ఎత్తు అయిన ప్రాంతాల్లో ఎంతో ద‌గ్గ‌ర‌గా ఉన్న‌ట్టు క‌నిపిస్తాయి.ఇక వీటి అందాల‌ను వీడియో రూపంలో పొందు ప‌రిస్తే ఎంత అందంగా ఉంటుందో ఇక్క‌డ మ‌న‌కు క‌నిపిస్తున్న వీడియోలో చూడొచ్చు.

ఏదో ఒక కవ్వంతో చిలికితే పాల నురుగ‌లాంటి మేఘాల‌తో నిండిన ఆకాశాన్ని చూస్తే ఎంత ఆనందంగా అనిపిస్తుందో క‌దా.అయితే ఇప్పుడు మ‌న‌కు ఇక్క‌డ అలాంటి ఆనందాన్ని ఈ వీడ‌యో పంచుతోంది.

అయితే ఈ విధ‌మైన మేఘాలు అర్జెంటీనా దూశంలో ఇలా ద‌ర్శ‌న‌మిచ్చాయి.

పాల బంతుల్లాగా ఏర్ప‌డిన మేఘాలు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేశాయి.అయితే  ఇలా  ఏర్ప‌డిన మేఘాల‌ను మమ్మటస్ అంటారు.ఇక ఈ వీడియోను చూస్తుంటే ఈ నెల 13వ తేదీన కార్డోబాలోని కాసా గ్రాండే ఏరియాలో ఇలా మమ్మటస్ మేఘాలు ఏర్ప‌డిన‌ట్టు తెలుస్తోంది.

చిన్న చిన్న సైజుల్లో తెల్ల‌గా ఉన్న మేఘాల‌ను అక్క‌డున్న వారు వీడియో తీసి నెట్టింట షేర్ చేయ‌గా అది కాస్తా కొద్ది నిముషాల్లోనే ట్రెండింగ్ లోకి వ‌చ్చేసింది.అయిలే ఇలాంటి మేఘాలు వ‌చ్చిన స‌మ‌యంలో మెరుపులతో కూడిన భారీ వర్షం ప‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

#Kasa #Cardoba #Argentian #Clouds

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube