జ‌గ‌న్ మీద అక్క‌సు నిమ్మ‌గ‌డ్డ ఇలా తీర్చుకుంటున్నారా ?  

is this what jagan taking revenge on nimmagadda,ap,ap political news,latest news,jagan,nimmagadda,ap government,election commissioner,revenge,elections,political fight,ysrcp leaders,jagan mohan reddy - Telugu Ap, Ap Government, Ap Political News, Election Commissioner, Elections, Jagan, Jagan Mohan Reddy, Latest News, Nimmagadda, Political Fight, Revenge, Ysrcp Leaders

రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్‌కు, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు, ప్ర‌బుత్వానికి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గు మ‌నే ప‌రిస్థితి నెల‌కొంది.గ‌త ఏడాది మార్చి నుంచి ఇరు ప‌క్షాల మ‌ధ్య స్థానిక ఎన్నిక‌ల‌ వివాదం.

TeluguStop.com - Is This What Jagan Taking Revenge On Nimmagadda

భోగి మంట‌ను త‌ల‌పిస్తున్న విష యం తెలిసిందే.గ‌త ఏడాది వ‌ర‌కు నిమ్మ‌గ‌డ్డ‌దే పైచేయి అయింది.

క‌రోనా నేప‌థ్యంలో స్థానిక ఎన్నిక‌ల‌ను వాయిదా వేయ‌డాన్ని.ఇటు మెజారిటీ ప్ర‌జ‌లు, అటు న్యాయ‌వ్య‌వ‌స్థ కూడా స్వాగ‌తించాయి.

TeluguStop.com - జ‌గ‌న్ మీద అక్క‌సు నిమ్మ‌గ‌డ్డ ఇలా తీర్చుకుంటున్నారా -Political-Telugu Tollywood Photo Image

అదేస‌మ‌యంలో ప్ర‌భుత్వం ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా.నిమ్మ‌గ‌డ్డ దూకుడును నిలువ‌రించ‌లేక‌పోయింది.

కోర్టుల నుంచి మొట్టి కాయ‌లు త‌ప్ప‌లేదు.

అయితే.

ఇప్పుడు వాద‌న రివ‌ర్స్ అయింది.ఎన్నిక‌లు నిర్వ‌హించి తీరాల్సిందేన‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్న నిమ్మ‌గ‌డ్డ‌.

త‌ద‌నుగు ణంగా త‌న‌దైన అధికారాల‌ను వినియోగించి.ప్ర‌భుత్వ అభీష్టంతో నిమిత్తం లేకుండా.

ముందుకు సాగుతున్నారు.ఈ క్ర‌మంలోనే షెడ్యూల్ కూడా ఇచ్చారు.

అయితే.క‌రోనా వ్యాప్తి త‌గ్గ‌లేద‌ని, క‌రోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నామ‌ని.

సో.ఇప్పుడు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం సాధ్యం కాద‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.ఈ మేర‌కు షెడ్యూల్‌ను స‌వాలు చేస్తూ. హైకోర్టుకు వెళ్ల‌డం.అక్క‌డ నిమ్మ‌గ‌డ్డ‌కు ఎదురు దెబ్బ త‌గ‌ల‌డం.తెలిసిందే.అయితే.సింగిల్ జ‌డ్జి ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను సవాల్ చేస్తూ.మ‌ళ్లీ హైకోర్టుకు వెళ్లిన నిమ్మ‌గ‌డ్డ‌కు ఇప్ప‌టికిప్పుడు ఉప‌శ‌మ‌నం ల‌భించ‌లేదు.

ఈ పిటిష‌న్‌పై వాద‌న‌ను ఈ నెల 18కి కోర్టు వాయిదా వేసింది.దీంతో నిమ్మ‌గ‌డ్డ ఒక‌ర‌కంగా ర‌గిలిపోతున్నార‌నే అంటున్నారు మేధావులు.ఇక, ఈ క్ర‌మంలోనే ఆయ‌న జ‌గ‌న్‌పై ఉన్న అక్క‌సునంతా మ‌రోరూపంలో తీర్చుకుంటున్నార‌ని ఉద్యోగులు చెబుతున్నారు.

రమేశ్ కుమార్ తన అధికారాలను వినియోగించి.క‌మిష‌న్‌లో కీల‌కంగా ఉన్న అధికారుల‌ను త‌ప్పించేస్తున్నారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ జీవీ సాయి ప్రసాద్‍పై వేటు వేస్తూ..

క్రమశిక్షణ చర్యలు చర్యలు తీసుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.ఈ నిర్ణ‌యం తీసుకుని 24 గంట‌లు కూడా గ‌డ‌వ‌క‌ముందే.

 తాజాగా క‌మిష‌న్‌ సెక్రటరీగా ఉన్న సీనియ‌ర్ ఐఏఎస్ వాణీ మోహన్‌ను తొలగిస్తూ  నిర్ణయం తీసుకోవ‌డం తీవ్ర సంచ‌ల‌నం సృష్టించింది.

వాణీమోహన్‌ సేవలు ఎన్నికల కమిషన్‌లో అవసరం లేదని, ఆమె‌ను రిలీవ్ చేస్తున్నామ‌ని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ అంశాల‌ను ప‌రిశీలిస్తున్న ఉద్యోగ సంఘాల వారు.ఈ చ‌ర్య‌ల‌ను తీవ్రంగా త‌ప్పుబ‌డుతున్నారు.

విస్తృత అధికారులు ఉన్నాయ‌ని.కీల‌క అధికారుల‌పై వేటు వేస్తారా? అంటూ.సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.ఈ ప‌రిణామం.అటు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా నిమ్మ‌గ‌డ్డ‌కు, ఇటు స‌ర్కారుకు మ‌ధ్య మ‌రింత‌గా గ్యాప్ పెంచుతుంద‌ని అంటున్నారు.మ‌రి మున్ముందు ఈ ప‌రిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి.

#Political Fight #Jagan #YSRCP Leaders #Nimmagadda #AP Government

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు