ట్రాప్ లో పడ్డాడా ? : పవన్ బాధను పట్టించుకునేవారే లేరా ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయం గా పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.మొదటి నుంచి జనసేన పార్టీని ఒక సమర్థవంతమైన రాజకీయ పార్టీగా ముందుకు తీసుకెళ్లడంలో పవన్ విఫలం అయ్యారు అనే వాదన ఉంది.

 Is This True Pawan Kalyan Trapin Bjp Party-TeluguStop.com

ముఖ్యంగా పార్టీని క్షేత్రస్థాయిలో బలం బలోపేతం చేయకుండా, ఇంతకాలం నెట్టుకు రావడం, మొదటి నుంచి టిడిపితో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకుని తాను సొంతంగా పోటీ చేసినా టీడీపీ ముందర చేరుపోకోలేకపోవడం, ఇవన్నీ ఇబ్బందికరంగా మారాయి.ఎన్నికల తర్వాత గాని ఆ ప్రభావం ఎంత వరకు ఉంది అనేది పవన్ కు అర్థం కాలేదు.

వచ్చే ఎన్నికల నాటికైనా ఏదో ఒక పార్టీ సహకారంతో అధికారం చేపట్టాలని ఆలోచన వచ్చిన పవన్ బీజేపీతో కలిసి అడుగులు ముందుకు వేశారు.

Telugu Ap Bjp, Ap Amaravathi, Ap Cm Jagan, Ap, Truepawan, Janasenapawan, Narendr

  కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో ఉండటంతో ఏపీలో పవన్ తో పాటు ప్రజా ఉద్యమాలు, ఏపీ ప్రభుత్వం పై పోరాటాలు, ఇలా ఎన్ని చేసినా తమతో పాటు బీజేపీ మద్దతు కూడా ఉంటుందని, దీని కారణంగా జగన్ దూకుడు తగ్గుతుందని అంచనా వేశారు.అయితే పవన్ ఆశలకు బిజెపి మొదట్లోనే గండి కొట్టడం మొదలు పెట్టింది.పవన్ రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఖచ్చితంగా బీజేపీతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే ఆ పార్టీ ఏపీలో పోరాటాలు చేసేందుకు అంత ఉత్సాహం చూపించడం లేదు.ఇదే పవన్ కు మింగుడుపడని విషయం గా మారింది.అమరావతి రైతుల కోసం కలిసికట్టుగా పోరాటం చేస్తామని ప్రకటించి దానికి ఫిబ్రవరి రెండో తేదీ ముహూర్తం కూడా పెట్టుకున్నారు.అయితే అనూహ్యంగా ఆ కార్యక్రమాన్ని బీజేపీ వాయిదా వేయించింది.

Telugu Ap Bjp, Ap Amaravathi, Ap Cm Jagan, Ap, Truepawan, Janasenapawan, Narendr

  ఏపీ శాసనమండలి రద్దు విషయంలోనూ బిజెపి వైసీపీకి మద్దతుగా నిలబడుతున్నట్టుగా వ్యవహరిస్తోంది.ఏపీ పరిధిలో తీసుకున్న నిర్ణయాలకు కేంద్రం అడ్డు చెప్పకుండా అవి తమ పరిధిలోని అంశం కాదు అంటూ బీజేపీ ప్రకటించడం పవన్ కు ఇబ్బందికరంగా మారింది.ఇక ఈ బడ్జెట్ సమావేశాల్లోనే బిజెపి ఆ బిల్లుకి ఆమోదముద్ర వేస్తే అది రాజకీయంగా ఇబ్బంది గా మారడమే కాకుండా, జనసేన భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం కనిపిస్తోంది.ఇదే సమయంలో తాము తెలుగుదేశం పార్టీతో వెళ్లకుండా ఉండేందుకు పొత్తు పేరుతో బిజెపి ఇలా కట్టడి చేసిందా అనే అనుమానాలు కూడా ఇప్పుడు జనసేన వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

అదే కనుక నిజమైతే పవన్ రాజకీయంగా వెనకబడి పోవడం , విమర్శలు ఎదుర్కోక తప్పదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube