నాగార్జున సాగర్ గెలుపు తరువాత టీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ ఇదే?

తెలంగాణలో టీఆర్ఎస్ వరుస ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయనే చెప్పవచ్చు.దుబ్బాక ఉప ఎన్నిక నుండి మొదలుకొని నేటి నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వరకు ఎన్నికల పరీక్షలను ఎదుర్కొంటూనే ఉంది.

 Is This The Trs Action Plan After The Nagarjuna Sagar Victory-TeluguStop.com

వీటిలో ఏ ఎన్నికలను నామమాత్రంగా తీసుకుందామనుకున్నా అన్ని కీలకమైన నియోజకవర్గాలే అని చెప్పవచ్చు.ఎందుకంటే ప్రతి ఎన్నిక టీఆర్ఎస్ కు ప్రజల్లో ఉన్న మద్దతుకు కొలమానంగా ప్రతిపక్షాలు ప్రచారం చేసిన పరిస్థితులలో తెరాస అధిష్టానం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

అయితే దుబ్బాక, గ్రేటర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత నాగార్జున సాగర్ ఉప ఎన్నిక మీద దృష్టి పెట్టిన తెరాస గెలుపు కోసం రకరకాల వ్యూహాలను రచించింది.అయితే నేడు పోలింగ్ జరుగుతున్న పరిస్థితులలో ఒకవేళ టీఆర్ఎస్ గెలిస్తే భారీ యాక్షన్ ప్లాన్ కు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

 Is This The Trs Action Plan After The Nagarjuna Sagar Victory-నాగార్జున సాగర్ గెలుపు తరువాత టీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ ఇదే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అదేంటి అనేది ఒకసారి మనం పరిశీలిస్తే ఇప్పటివరకు కేసీఆర్ కు చెడ్డ పేరు తీసుకొస్తున్న కొన్ని అంశాలను శాశ్వతంగా పరిష్కరించాలని యోచిస్తున్నట్టు సమాచారం.ఎందుకంటే ఇంకా ఎన్నికల సంవత్సరం పోనూ ఇంకో సంవత్సరమే మిగిలి ఉండడంతో కేసీఆర్ ప్రజలను టీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత తొలిగిపోయేలా వ్యూహ రచన చేస్తున్నట్టు వినికిడి.

మరి టీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ ఎంతవరకు సఫలమవుతుందో చూడాల్సి ఉంది.

#@trspartyonline #@CM_KCR

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు