భవిష్యత్తులో టీఆర్ఎస్ పై బీజేపీ ప్రయోగించనున్న వ్యూహం ఇదే?

ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ ను పదునైన విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పార్టీ బీజేపీ అన్న విషయం విదితమే.టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అని ప్రజల్లోకి బలంగా వెళ్లాలన్నది బీజేపీ ప్రధాన లక్ష్యం.

 Is This The Strategy That The Bjp Will Implement On Trs In The Future Bjp Party,-TeluguStop.com

అయితే చాలా వ్యూహాత్మకంగా టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫ్యల్యాలను ప్రజల ముందు ఉంచుతూ తెలంగాణలో తమ పార్టీ ఉనికిని పెంచుకుంటూ బీజేపీ ముందుకెళ్తోంది అన్నది సుస్పష్టమే.కాని టీఆర్ఎస్ కు ఎక్కడైతే బలంగా ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయో, ఆ నియోజకవర్గాలలో టీఆర్ఎస్ ను బలహీనం చేయాలన్నది బీజేపీ అంతర్గత వ్యూహంలో భాగంగా ప్రయోగిస్తూ వస్తోంది.

అయితే ఇక సార్వత్రిక ఎన్నికలు జరిగే సంవత్సరం ముందు బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేసి టీఆర్ఎస్ బలహీన పడింది, ప్రజలు బీజేపీవైపు చూస్తున్నారు అనే వాతావరణం వచ్చిన తరువాత బీజేపీ వేసే ఈ వ్యూహం టీ ఆర్ఎస్ ను చాలా వరకు బలహీన పరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.అదే ఆపరేషన్ ఆకర్ష్.

సరిగ్గా ఎన్నికల ముందు టీఆర్ఎస్ లో ఉన్న కీలక నాయకులను బీజేపీలో చేర్చుకుని అదే నాయకులను ఆసరాగా చేసుకొని టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించి ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకోవాలన్నది బీజేపీ వ్యూహంలా కనిపిస్తోంది.మరి బీజేపీ అనుసరించబోతున్న ఈ వ్యూహం ఎంత వరకు ఫలిస్తుందనేది చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube