యువ నాయకులకు బీజేపీ ప్రాధాన్యం ఇవ్వడం వెనుక వ్యూహం ఇదే?

ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ రోజురోజు కు బలపడుతోంది.టీఆర్ఎస్ పై మాటల తూటాలు పేలుస్తూ క్షేత్ర స్థాయిలో క్యాడర్ ను భవిష్యత్తు ఎన్నికల విజయం కోసం వ్యూహాలు రచిస్తూ సన్నద్ధం చేస్తూ బలపడుతోంది.

 Is This The Strategy Behind The Bjps Preference For Young Leaders, Bandi Sanjay,-TeluguStop.com

దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటడంతో ఇతర పార్టీలలో ఉన్న అసంతృప్తి నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.అయితే బీజేపీ యువకులకు ప్రాధాన్యం ఇస్తూ ఒక ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తోంది.

అయితే యువకులకు ప్రాధాన్యత ఇవ్వడం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటని ఒక్కసారి మనం గమనిస్తే భవిష్యత్తు ఎన్నికల సమయం వరకు రకరకాల అంశాల మీద పోరాడితేనే ఇంకాస్త ప్రజల మన్ననలు పొందే అవకాశం ఉంది.అయితే అలా చేస్తున్న పోరాటాలు శక్తివంతంగా ఉండాలంటే యువకులతో నే సాధ్యం.

అప్పుడే క్షేత్ర స్థాయిలో బీజేపీ అంటేఏంటో ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించవచ్చు.అదే విధంగా కేటీఆర్ కూడా యువ నాయకుడు కావడంతో అతనికి ధీటుగా సమాధానం ఇచ్చేందుకు యువ నాయకులను తయారు చేస్తేనే భవిష్యత్తులో టీఆర్ఎస్ ను ఎదుర్కోగలమని భావించి ఇటువంటి వ్యూహాన్ని బీజేపీ ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

తాజాగా సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలో యువ నాయకుడు పాల్వాయి హరీష్ బాబు చెరికతో బీజేపీ వ్యూహం ఏంటో ఇట్టే అర్ధమవుతోంది.

Telugu @bjp4telangana, Bandi Sanjay, Preference, Strategy, Telangana Bjp, Young- .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube