Akhanda 2 : బాలయ్య అఖండ2 మూవీ కథ ఇదేనా.. మరీ ఈ రేంజ్ లో సినిమాను ప్లాన్ చేశారా?

Is This The Story Of Balayya Akhanda 2 Movie Have You Planned A Movie In This Range

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలయ్య( Nandamuri Balakrishna ) ఒకప్పుడు ఎంత రేంజ్ లో దూసుకెళ్లాడో ఇప్పుడు కూడా అంతే రేంజ్ లో దూసుకెళ్తున్నాడు.తన ఎనర్జీ గురించి ఆలోచించకుండా వచ్చిన సినిమాలకు సైన్ చేస్తూ వరుస హిట్ లు అందుకుంటున్నాడు.

 Is This The Story Of Balayya Akhanda 2 Movie Have You Planned A Movie In This R-TeluguStop.com

యంగ్ హీరోల కంటే ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు.ఇక గత ఏడాది బోయపాటి శ్రీను(Boyapati Srinu ) దర్శకత్వంలో విడుదలైన అఖండ సినిమాతో కెరీర్ పరంగా సెన్సేషనల్ హిట్ ను సొంతం చేసుకున్నాడు.

అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి భారీ వసూళ్లు సొంతం చేసుకుంది.ఇక అఖండ సినిమా తర్వాత మరో సినిమాలో బిజీగా మారాడు.గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా, అనిల్ రావిపూడి దర్శకత్వం లో కూడా మరో సినిమా, వెంకీ అట్లూరితో పాటు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ తో పాటు దిల్ రాజు బ్యానర్ లో కూడా వరుస సినిమాలకు సైన్ చేశాడని తెలుస్తుంది.

Telugu Akhanda, Balakrishna, Balayya, Boyapati Srinu, Pragya Jaiswal, Tollywood-

మొత్తానికి ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకుండా తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు.అయితే తాజాగా అఖండ 2 ( Akhanda 2 )సినిమాకు సంబంధించిన కథ గురించి తెలిసింది.గతంలో ఈ సినిమా సీక్వెల్ ఉం
టుందని బాలయ్య ప్రకటించిన సంగతి తెలిసిందే.

దీంతో అప్పటినుండి బాలయ్య అభిమానులు ఈ సినిమా అప్డేట్ గురించి బాగా ఎదురుచూస్తున్నారు.

Telugu Akhanda, Balakrishna, Balayya, Boyapati Srinu, Pragya Jaiswal, Tollywood-

దీంతో ఈ నేపథ్యంలో పార్ట్ 2 కు సంబంధించిన కథ గురించి తెలియటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే కథ ఏంటంటే.ఓ స్వార్థపరుడి చేతిలో పడి నాశనం అవుతున్న ప్రజలను, ముఖ్యంగా తిరుమలేశుని ప్రతిష్టను తగ్గించే కార్యక్రమాలు చేసే వ్యక్తులను హీరో అంతం చేస్తాడు అని తెలిసింది.

Telugu Akhanda, Balakrishna, Balayya, Boyapati Srinu, Pragya Jaiswal, Tollywood-

అంతేకాకుండా ఇతర మతస్థుడు నాయకుడు కావడంవల్ల దేవాలయాలపై ఎలాంటి దాడులు జరుగుతాయి అనేది.వాటిని అరికట్టడానికి హీరో ఏం చేస్తాడు అనేది కథలో ఉన్నట్టు తెలుస్తుంది.అంటే ఈ సినిమా పొలిటికల్ అంశాలతో కూడా ఉండబోతుందని అర్థమవుతుంది.ఇక ఈ సినిమా గురించి అనౌన్స్ చేసినప్పుడే భారీ అంచనాలు వెలువడగా.జూన్ 10 బాలయ్య పుట్టినరోజున ఈ సినిమా గురించి అధికారంగా ప్రారంభిస్తే ఈ సినిమాపై ఇంకెంతలా అంచనాలు పెంచుకుంటారో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube