మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలలో తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ ఊహించని విధంగా విజయాన్ని నమోదు చేసుకుంది.బిజెపి గట్టి పోటీ ఇచ్చినా.
టిఆర్ఎస్ ఓటమి చెందుతుందని అంతా అంచనా వేసినా కేసిఆర్ మాత్రం గెలుపు పై ధీమాతో నే ఉంటూ వచ్చారు.దానికి అనుగుణంగానే ఎన్నికల ఫలితాలు వెలువడటంతో టిఆర్ఎస్ పై ప్రజల్లో వ్యతిరేకత లేదని , గత ఎనిమిదేళ్లుగా టిఆర్ఎస్ పాలన పై ప్రజల్లో సంతృప్తి ఉందనే విషయం మునుగోడు ఎన్నికల ఫలితాలతో తేలిపోయింది.
ఇక ఈ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత టిఆర్ఎస్ కార్యకర్తలలోనూ మరింత జోష్ పెరిగింది.ఎప్పటి నుంచో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్న కెసిఆర్ కు ఈ ఉప ఎన్నికల ఫలితాలు మంచి ఉత్సాహాన్ని ఇస్తున్నాయి.
ప్రజల్లో టిఆర్ఎస్ పై వ్యతిరేకత లేదని విషయం తేలిపోవడంతో ఇదే సరైన సమయం అని, ముందస్తు ఎన్నికలకు వెళ్తే మూడోసారి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని కేసీఆర్ అంచనా వేస్తున్నారట.అందుకే దీనికి సంబంధించిన కసరత్తును ఆయన మొదలుపెట్టినట్లు సమాచారం.
బిఆర్ఎస్ పార్టీ పేరుతో జాతీయ పార్టీ స్థాపించిన కేసీఆర్ కు దేశవ్యాప్తంగా బిజెపికి వ్యతిరేకంగా పోరాడేందుకు మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు బాగా కలిసి వచ్చాయి.
గుజరాత్ ఎన్నికలలోను బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించేందుకు కేసిఆర్ సిద్ధమవుతున్నారు.టిఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ అగ్రనేతల నుంచి , రాష్ట్రస్థాయి నాయకులు వరకు ఎంతమంది ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా ప్రజలు నమ్మలేదని, జాతీయస్థాయిలో బిజెపిపై ఉన్న వ్యతిరేకితే ఈ మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల రూపంలో వచ్చిందని కేసిఆర్ బలంగా నమ్ముతున్నారు.ఇక కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉండడం తో ముందు ముందు కూడా తమకు ఇబ్బందులు ఉండవనే లెక్కల్లో కేసీఆర్ ఉన్నారట.