చిత్రసీమ కు జగన్ కు మధ్య గ్యాప్ ?  ఇదీ ఓ కారణమా ? 

Is This The Reason Why Jagan Is Angry Over Tollywood

ప్రస్తుతం ఏపీ రాజకీయాలు వాడివేడిగా ఒకవైపు కొనసాగుతుండగానే మరోవైపు చిత్రసీమకు , ఏపీ ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్ష,  పరోక్ష యుద్ధం కొనసాగుతోంది.సినిమా టికెట్ల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోవడం సినీ పెద్దలు చాలా మందికి నచ్చలేదు.

 Is This The Reason Why Jagan Is Angry Over Tollywood-TeluguStop.com

దీంతో రకరకాల కామెంట్స్ ఏపీ ప్రభుత్వం పై చేస్తుండగా దానికి కౌంటర్ గా ఏపీ మంత్రులు చిత్రసీమకు చెందిన వారిపైన అనేక విమర్శలు చేస్తున్నారు .టాలీవుడ్ నిర్మాతలు, హీరోలు ఎవర్ని వదిలిపెట్టకుండా అందరి వ్యవహారాలను బయట పెడుతున్నారు.దీంతో మేము ఎక్కడ తగ్గేది లేదు అన్నట్లుగా సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది వ్యక్తులు స్పందిస్తూ వైసిపి మంత్రులకు కౌంటర్ ఇస్తూ ఉండడంతో ఈ వివాదం మరింత ముదురుతోంది.
    ఈ నేపథ్యంలోనే నిన్న మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం జగన్ ను కలిశారు.

అనేక అంశాలకు సంబంధించి ఇద్దరి మధ్య చర్చ జరిగింది.జగన్ తో భేటీ పై చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు.

 Is This The Reason Why Jagan Is Angry Over Tollywood-చిత్రసీమ కు జగన్ కు మధ్య గ్యాప్  ఇదీ ఓ కారణమా -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ప్రభుత్వానికి టాలీవుడ్ కు మధ్య ఏర్పడిన వివాదాన్ని ముగించే దిశగా చిరంజీవి అడుగులు వేశారు.ఇది ఇలా ఉంటే అసలు సినీ ఇండస్ట్రీకి, వైసీపీ ప్రభుత్వానికి మధ్య వివాదం ఏర్పడడానికి కారణం మాత్రం టికెట్ల వ్యవహారం ఒకటైతే, జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఎవరు ఆయన్ను కలవకపోవడం, ఆయనను అభినందించి సన్మానం చేయకపోవడం వంటివి చాలా సీరియస్ గా తీసుకున్నారని, అందుకే ఈ టికెట్ల వ్యవహారం వంటి వాటిల్లో ఏపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందనే చర్చ జరుగుతోంది.
 

ఇదే విషయాన్ని సినీ ఇండస్ట్రీ వారు ఒప్పుకుంటున్నారు.గతంలో ఎవరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినా, సినిమా ఇండస్ట్రీ తరఫున వెళ్లి వారిని కలిసి అభినందించి సన్మానం చేయడం ఆనవాయితీగా వస్తోందని,  కానీ జగన్ విషయంలో అలా జరగలేదనే విషయాన్ని వారు ఒప్పుకుంటున్నారు.ఇదే విషయాన్ని సినీ నిర్మాత ఎం వి ప్రసాద్ జగన్ ను సన్మానించాలని మొదట్లో అనుకున్నామని,  కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు అని,  చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయిన జగన్ అంటే సినీ పరిశ్రమలో అందరికీ గౌరవం ఉందని,  త్వరలోనే ఆయనకు సన్మాన కార్యక్రమం చేపడతామని వ్యాఖ్యానించడం చూస్తుంటే జగన్ నిజంగా ఈ విషయంలో హర్ట్ అయ్యారా అనే అనుమానాలు జనాల్లో కలుగుతున్నాయి.

Video : Is This The Reason Why Jagan Is Angry Over Tollywood, Jagan, Ap Cm, Ysrcp, TDP, Chandrababu, Ysrcp, Ap Government, Tollywood, Megastar Chiranjivi, NV Prasad, Ysrcp Government,

is this the reason why jagan is angry over tollywood, Jagan, ap cm, ysrcp, TDP, Chandrababu, ysrcp, ap government, tollywood, megastar chiranjivi, NV Prasad, ysrcp government, - Telugu Ap Cm, Ap, Chandrababu, Jagan, Chiranjivi, Nv Prasad, Tollywood, Ysrcp

#Jagan #Chiranjivi #NV Prasad #AP #Ysrcp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube