టీమిండియా ఘోరమైన ఓటమికి కారణం ఇదేనా..?!

2007లో జరిగిన ప్రపంచకప్‌లో భారత జట్టు చూపించిన అద్భుతమైన ఆటతీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది.అప్పట్లో విజేతగా నిలిచిన టీమిండియా ఈసారి కనీసం సెమీఫైనల్‌కు కూడా వెళ్లలేకపోయింది.

 Is This The Reason For Team India Lost To New Zealand In Icc T20 World Cup Match-TeluguStop.com

ప్రస్తుత పరిస్థితులలో ఒకవేళ సెమీఫైనల్‌కు వెళ్లాలన్నా.అద్భుతాలు జరగాల్సిందే.

దాంతో అభిమానులు ఎప్పటిలాగే తీవ్ర నిరాశలో మునిగితేలుతున్నారు.పోయినసారి కూడా రెండో స్థానంతో సరిపెట్టుకున్న టీమిండియా ఇప్పుడు మరింత చతికిలపడటంతో దానికి కారణాలు ఏమై ఉంటాయని ఫ్యాన్స్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇదిలా ఉండగా విశ్లేషకులు మాత్రం టీమిండియా ఘోర పరాజయం పాలు కావడానికి చాలా కారణాలు ఉన్నాయని వెల్లడిస్తున్నారు.జట్టును సరిగా ఎంచుకోకపోవడమే ప్రధాన సమస్య అని చాలా మంది చెబుతున్న మాట.జోరు మీద లేని హార్దిక్ పాండ్యాని ఎంచుకోవడమే బిగ్గెస్ట్ మైనస్ అని చెప్పే వారు లేకపోలేదు.న్యూజిలాండ్ జట్టుతో ఆడుతున్నప్పుడు బ్యాటింగ్ ఆర్డర్లో ఎందుకు మార్పు చేయాల్సిన అవసరం వచ్చిందో కూడా తెలియక అసహనం వ్యక్తం చేస్తున్నారు.

యూఏఈలో పిచ్‌లు రెండో బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతున్నాయి.

Telugu Hardik Pandya, Icc Cup, India Zealand, Latest, Target, Losser, Zealand, P

కానీ కీలక మ్యాచ్‌ల్లోనే టీమ్ ఇండియా జట్టు టాస్ ఓడిపోయింది.దాంతో మ్యాచ్ గెలవడం చాలా కష్టంగా మారిపోయింది.ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో రెండవసారి బ్యాటింగ్‌కు దిగిన జట్లు గెలవడమే విశేషం.

అంతమాత్రాన మన జట్టు బ్యాటింగ్‌ చెత్తగా తయారయిందనే విషయాన్ని విస్మరించరాదు.నిన్న జరిగిన మ్యాచ్‌లో వరుసగా వికెట్లు పడుతున్నప్పుడు ఒక్క బ్యాట్స్‌మన్ కూడా క్రీజులో నిలబడేందుకు ప్రయత్నం చేయలేదు.

Telugu Hardik Pandya, Icc Cup, India Zealand, Latest, Target, Losser, Zealand, P

చిన్నాచితకా జట్లు కూడా ప్రపంచకప్‌లో వరుస సిక్సర్లు, ఫోర్లతో చెలరేగిపోతుంటే మన టీమిండియా జట్టు మాత్రం బౌండరీలు కొట్టడానికి చాలా ఇబ్బంది పడిపోయింది.ఇక విరాట్ కోహ్లీ కూడా న్యూజిలాండ్‌పై గెలవాలన్న తపన ఎవరిలోనూ కనిపించలేదు అనే విషయాన్ని ఒప్పుకున్నారు.మరోవైపు అభిమానులు మాత్రం టీమిండియా తో పాటు ఐసీసీపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.టాస్ గెలిచినోడితే విజయం అన్నట్లు పిచ్‌లు ఉండటం చాలా దారుణం అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube