టీఆర్ఎస్- బీజేపీ ఒకటేనని రేవంత్ ప్రచారం వెనుక అసలు వ్యూహం ఇదే?

తెలంగాణ కాంగ్రెస్ బలహీనంగా ఉన్న పరిస్థితులలో కాంగ్రెస్ ను ఒంటిచేత్తో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి నడిపిస్తున్న విషయం తెలిసిందే.వరుస కుమ్ములాటలతో కాంగ్రెస్ ప్రజల్లో పలుచబడ్డ పరిస్థితి మనకు తెలిసిందే.

 Is This The Real Strategy Behind The Rewanth Campaign That Trs-bjp Is One, Kcr,-TeluguStop.com

తెలంగాణ కాంగ్రెస్ నాయకులలో ఉన్న ఈ ఆధిపత్య పోరుతోనే కాంగ్రెస్ కు భారీగా నష్టం జరుగుతోంది.ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ అధిష్టానం దిద్దుబాటు చర్యలు ఏమీ తీసుకోదు.

త్వరలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.అయితే ఇప్పటికే గట్టిగా అందరూ ఏకమై పోరాడాల్సిన సమయంలో ఎవరికి వారే సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితి ఉంది.

అయితే రేవంత్ వరుస సమావేశాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి తన వంతు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది.అయితే ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

టీఆర్ఎస్- బీజేపీ మిత్రపక్షాలని, బయటకి విమర్షించుకుంటున్నా వారి మైత్రి కొనసాగుతుందని అన్నారు.ఈ వ్యాఖ్యల వెనుక గల వ్యూహాన్ని మనం గమనిస్తే టీఆర్ఎస్, బీజేపీ ఒకరినొకరు విమర్శలు చేసుకుంటున్న పరిస్థితులలో వారు ఒకటే అని ప్రజలకు సంకేతాన్ని ఇవ్వగలిగితే కాంగ్రెస్ వైపు ప్రజల దృష్టి మలచాలన్నది రేవంత్ వ్యూహం లా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరి రేవంత్ వ్యూహాలు ఫలించి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు విజయం సాధిస్తే కాంగ్రెస్ కొంత గాడినపడినట్లే నని చెప్పుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube