బండి సంజయ్ పాదయాత్ర నిర్ణయం వెనుక అసలు వ్యూహం ఇదే?

తెలంగాణలో బీజేపీ ఎప్పటి నుండో ఉన్నా సంస్థాగతంగా అంతగా బలపడిన పరిస్థితి లేదు.అప్పటి వరకు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లాంటి వ్యక్తులు అధ్యక్షులుగా పనిచేసినా స్థానికంగా బలోపేతం కాలేదు.

 Is This The Real Strategy Behind The Decision Of Bandi Sanjay Padayatra, Telanga-TeluguStop.com

కాని బండి సంజయ్ టీడీపీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన తరువాత తెలంగాణలో బీజేపీ ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగసి పడ్డ విషయం తెలిసిందే.అయితే దుబ్బాక ఉప ఎన్నికలు మొదలుకొని జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీ విజయ ఢంకా మోగించిన విషయం తెలిసిందే.

అయితే ఆ తరువాత టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీని ప్రజలు భావించిన విషయం తెలిసిందే.అయితే త్వరలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇక త్వరలో సార్వత్రిక ఎన్నికలు కూడా సమీపిస్తున్న తరుణంలో స్థానిక సమస్యలను.

Telugu @bandisanjay_bjp, @bjp4telangana, Bjp, Strategybandi, Telangana-Political

టీఆర్ఎస్ వైఫల్యాలను రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు తీసుకరావడమే బండి సంజయ్ ప్రధాన వ్యూహంలా కనిపిస్తోంది.లేకపోతే బీజేపీని మరింత ప్రజా బలాన్ని సాధించుకునే దిశగా కృషి చేయాలంటే పాదయాత్ర నే ప్రధాన అస్త్రంగా బండి సంజయ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.అంతేకాక పాదయాత్ర వలన స్థానిక కార్యకర్తలకు భరోసాను ఇచ్చే అవకాశం కలుగుతుంది.ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో బండి సంజయ్ పాదయాత్ర పై సర్వత్రా చర్చ జరుగుతోంది.మరి పాదయాత్ర చేపట్టిన తరువాత ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube