కేసీఆర్ పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల వెనక అసలైన వ్యూహం ఇదే?

బండి సంజయ్ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత బీజేపీ దశ తిరిగిందని చెప్పవచ్చు.వ్యూహ, ప్రతి వ్యూహాలతో టీఆర్ఎస్ సర్కారును ఇరుకున పెడుతున్న బండి సంజయ్ కేసీఆర్ పై రోజురోజుకు మాటల దాడి పెంచుతున్నాడు.

 Is This The Real Strategy Behind Bandi Sanjays Comments On Kcr-TeluguStop.com

అయితే వరుస సభలలో పాల్గొంటూ బీజేపీ నాయకత్వాన్ని నిర్మిస్తూ టీఆర్ఎస్ కు ధీటుగా నిలబడే ప్రయత్నం చేస్తోంది.అయితే తాజాగా కేసీఆర్ పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

కేసీఆర్ తీవ్రమైన అవినీతికి పాల్పడ్డాడని ఒక్కసారిగా బాంబు పేల్చారు.త్వరలోనే కేసీఆర్ బండారం బయటపెడతానని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 Is This The Real Strategy Behind Bandi Sanjays Comments On Kcr-కేసీఆర్ పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల వెనక అసలైన వ్యూహం ఇదే-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ వ్యాఖ్యలు వెనుక ప్రత్యేక వ్యూహం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.కేసీఆర్ ను టార్గెట్ చేయడం ద్వారా ప్రజల చూపు కేసీఆర్ పై మళ్లుతుందని, అప్పుడు ఇంకా మాటల దాడి పెంచితే కేసీఆర్ ప్రతిష్ట మసకబారుతుందనేది బీజేపీ వ్యూహం.

తద్వారా ఈ వ్యూహం ద్వారా టీఆర్ఎస్ ను మరింత ఇరుకున పెట్టొచ్చనేది బీజేపీ మాస్టర్ ప్లాన్ గా తెలుస్తోంది.ఏది ఏమైనా బండి సంజయ్ తన వ్యూహాలతో కేసీఆర్ ను ముప్పుతిప్పలు పెట్టేలా కనిపిస్తోంది.

అయినప్పటికీ కేసీఆర్ మౌనంగా ఉండడం వెనుక కేసీఆర్ బలమైన వ్యూహాన్ని రచించే అవకాశం లేదు.త్వరలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ ఓటమి చెందితే బీజేపీ ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంది.

బీజేపీ మరింత విస్తరించడానికి కొంచెం ఉత్తేజాన్ని ఇస్తుంది.

Telugu @bjp4india, @bjp4telangana, Bandi Sanjay, Corruption, Kcr, Sensational Comments, Telangana Politics, Trs-Telugu Political News.

#@BJP4India #Corruption #Bandi Sanjay #@BJP4Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు