ఎమ్మెల్సీ ఓటమిపై రేవంత్ స్పందించక పోవడానికి అసలు కారణం ఇదే?

తెలంగాణలో కాంగ్రెస్ రోజురోజుకు ప్రజల్లో నమ్మకం కోల్పోతోంది.అంతర్గత కలహాలు, సరైన నాయకత్వ లోపంతో ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ పార్టీ ఇటీవల జరిగిన దుబ్బాక, జీహెచ్ఎంసీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయి చతికిల పడ్డ విషయం తెలిసిందే.

 Is This The Real Reason Why Rewanth Did Not React To The Defeat Of Emmelsie, Rew-TeluguStop.com

ప్రజల్లో రోజురోజుకు కాంగ్రెస్ పై నమ్మకం సన్నగిళ్ళుతున్న తరుణంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒంటరిగా పోరాడుతూ కాంగ్రెస్ ను తిరిగి గాడిలో పడేయానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది.

రాజీవ్ రైతు భరోసా పేరిట పాదయాత్ర నిర్వహించిన రేవంత్ కాంగ్రెస్ ను క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేయాలనే వ్యూహంతో పాదయాత్రకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది.

అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి చెందడంతో రేవంత్ ఈ ఓటమిపై ఎలా స్పందిస్తాడని అందరూ వేచి చూసారు.అయితే రేవంత్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమిపై స్పందించలేదు.

అయితే అందుకు బలమైన కారణం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.అయితే షర్మిల పేరిట రెడ్డి సామాజిక వర్గం గల నేతలు షర్మిల పార్టీ వైపు మొగ్గు చూపే పరిస్థితి ఉండడంతో ఎలాగూ కాంగ్రెస్ లో ఒంటరి పోరాటం చేయాల్సి వస్తున్న తరుణంలో కొత్త పార్టీ ఏర్పాటు చేయాలని బలంగా నిర్ణయించ్చినట్లు తెలుస్తోంది.

అయితే కొత్త పార్టీకి సంబంధించిన వివరాలు త్వరలో బయటికి తెలుపనున్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube