బీజేపీని కేసీఆర్ టార్గెట్ చేయడానికి అసలు కారణం ఇదే?

తెలంగాణ రాజకీయాలు అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలతో హాట్ హాట్ గా మారుతున్న పరిస్థితి ఉంది.ఇక మొన్నటి వరకు కేసీఆర్ స్పందించక పోవడంతో  ఇక బీజేపీ ఒక్కసారిగా రెచ్చిపోయిన పరిస్థితి ఉంది.

 Is This The Real Reason Why Kcr Is Targeting Bjp Bandi Sanjay, Kcr, Trs Party-TeluguStop.com

అయితే ఇక ఏకంగా కేసీఆర్ రంగంలోకి దిగడంతో బీజేపీ నేతలెవ్వరూ గతంలో స్పందించినంతగా ఎవరూ స్పందించడం లేదు.వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ వేసిన సవాల్ కు బీజేపీ నుండి సరైన సమాధానం రాలేదు.

అయితే బీజేపీ ని ఇప్పుడు కేసీఆర్ టార్గెట్ చేయడం వెనుక అసలు కారణం ఏంటనే విషయంపై రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Telugu @bjp4telangana, @cm_kcr, @trspartyonline, Bandi Sanjay, Telangana-Politic

ప్రస్తుతం హుజూరాబాద్ లో బీజేపీ గెలిచిన కారణంగానే బీజేపీని టీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్ చేస్తున్నారని ఒక వర్గంలో చర్చ జరుగుతుండగా, రైతులకు తప్పుడు సలహాలు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం వరి కొనలేము అని రాసిచ్చినా కూడా తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం రైతులకు వరి వేయమని చెబుతూ వాళ్ళు నష్టానికి గురి చేయాలన్నది బీజేపీ వ్యూహమని, తద్వారా రైతులు రోడ్ల మీదికి వచ్చి ధర్నాలు చేయడం ద్వారా రాజకీయ లబ్ధి చేకూరాలని బీజేపీ ఆలోచిస్తున్నదని టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి ఉంది.రాష్ట్రంలో చాలా అద్భుత రీతిలో ఉన్న వ్యవసాయాన్ని, రైతులను రాజకీయం గురించి నష్టపరచవద్దని కేసీఆర్ తన విలేఖరుల సమావేశంలో చెబుతున్న పరిస్థితి ఉంది.ఏది ఏమైనా ఇక కాంగ్రెస్ టార్గెట్ చేసి కాంగ్రెస్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన కేసీఆర్, ఇక బీజేపీ తప్పులను ప్రజల ముందు ఎండగడుతూ బీజేపీని కూడా భూ స్థాపితం చేయాలన్నది కేసీఆర్ లక్ష్యంగా ఉన్న పరిస్థితి ఉంది.

ఏది ఏమైనా ఇక రానున్న రోజుల్లో బీజేపీ ఇప్పుడు మాట్లాడినంత అసత్య ప్రచారాలు చేసే అవకాశం లేదు.ప్రజల నుండే బీజేపీ నేతలకు ప్రతిఘటన ఎదురయ్యేలా చేసే అవకాశం కూడా లేకపోలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube