బిగ్ బాస్ సీజన్ 6 త్వరగా రావడానికి అసలు కారణం ఇదేనా?

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణ దక్కించుకొని విజయపథంలో దూసుకుపోతున్న బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకొని ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.

 Is This The Reason For Bigg Boss 6 Coming Soon Details, Bigg Boss 6, New Season-TeluguStop.com

ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమం తెలుగులో ఐదవ సీజన్ పూర్తి చేసుకుంది.ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే ఈరోజు నాగార్జున తర్వాతి సీజన్ గురించి కూడా ప్రకటించారు.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ కార్యక్రమం మరొక రెండు నెలల్లో ప్రసారం కానుందని తెలుస్తోంది.

ఇప్పటివరకు ఒక సీజన్ నుండి మరొక సీజన్ ప్రారంభం కావడానికి సుమారు ఆరేడు నెలల సమయం పట్టేది.

కానీ బిగ్ బాస్ ఐదవ సీజన్ పూర్తి కాగానే ఆరో సీజన్ కి కేవలం రెండు నెలల వ్యవధి మాత్రమే ఉంది.త్వరగా బిగ్ బాస్ కార్యక్రమం రావడానికి గల కారణం ఏమిటి అని చాలామంది చర్చించుకుంటున్నారు.

అయితే ఈ కార్యక్రమం త్వరగా ప్రసారం కావడానికి కారణం ఏమిటి అనే విషయాన్ని నిర్వాహకులు వెల్లడించారు.

ఈ కార్యక్రమం మరింత ఆలస్యమైతే కరోనా వచ్చే ప్రభావం ఉంది కనుక ముందుగానే ఈ సీజన్ ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

Telugu Bigg Boss, Corona, February, Nagarjuna, Season, Telugu, Telugu Biggboss-M

అలాగే ఈ కార్యక్రమాన్ని మరింత ఆలస్యం చేస్తే ఐపీఎల్ ప్రారంభం అవుతుంది ఆ సమయంలో ఈ కార్యక్రమం రేటింగ్ దారుణంగా పడిపోతాయనే ఉద్దేశంతో ముందుగానే 6 వ సీజన్ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.ఈ క్రమంలోనే ఇప్పటికీ కంటెస్టెంట్ ల కసరత్తు మొదలైందని తెలుస్తోంది.బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కి ఉపయోగించిన ఇంటిని కొన్ని మార్పులు చేసే ఆరవ సీజన్కు ఉపయోగించనున్నారు.అలాగే ఈ సీజన్లో ఎలాంటి ఎడిటర్స్ లేకుండా ప్రసారం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube