కేసీఆర్ దూకుడు వెన‌క అస‌లు కార‌ణం ఇదేనా..?

మొన్న‌టి వ‌ర‌కు కాస్త సైలెంట్‌గా కనిపించిన కేసీఆర్ స‌మ‌యం చూసి త‌న మార్కు రాజ‌కీయం మొద‌లు పెట్టారు.ఇప్పుడు కార‌ణం ఏదైనా ఆయన నీళ్ల సెంటిమెంట్‌ను రాజేశారు.

 Is This The Real Reason Behind Kcr Aggression, Kcr, Trs, Politics, Ap, Telangana-TeluguStop.com

అంతే కాదు ఏకంగా ప్రాజెక్టుల వ‌ద్ద పోలీసుల‌ను కూడా మోహ‌రించే స్థాయికి త‌న దూకుడును పెంచారు.అయితే ఈ దేశంలో ఇప్ప‌టి దాకా ఒక నీటి ప్రాజెక్టు ద‌గ్గ‌ర ఇలా బలగాలను మోహరించడం ఇదే మొద‌టిసారి అని చాలామంది విశ్లేష‌కులు వివ‌రిస్తున్నారు.

అంతే కాదు వంద‌శాతం విద్యుత్ ఉత్ప‌త్తిని సాధించాల‌ని కేసీఆర్ ఇప్ప‌టికే స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇవ్వ‌డం వెన‌క రెండు తెలుగు రాష్ట్రాల్లో అస‌లు త‌న‌ను ఢీకొట్టే వ్య‌క్తి లేడ‌నే ఆయ‌న సంకేతాలు ఇస్తున్న‌ట్టు తెలుస్తోంది.ఈ విష‌యంలో కేసీఆర్ ఆలోచ‌న నిజ‌మ‌నే చెప్పాలి.

ఎందుకంటే కేసీఆర్ కంటే పరిణితి ఉన్న నాయకుడు, ఆయ‌న లాగా వ్యూహాలు ప‌న్నే దిట్ట లేర‌నే చెప్పాలి.ఏదైనా విష‌యంలో కేసీఆర్ ఎంతో ముందు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తారు.

ఆయ‌న ఏ ప‌నిచేసినా దాని వెన‌క లోతైన కార‌ణం కూడా ఉంటుంది.

అయితే ఇప్పుడు దేశ రాజ‌కీయాల్లో త‌న మార్కును చూపించాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్న కేసీఆర్ ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అస‌లు త‌న‌కు ఎదురే లేద‌ని, త‌ను చెప్పిందే న‌డుస్తుంద‌నే సంకేతాలు ఇచ్చేందుకు చూస్తున్నారు.

Telugu @cm_kcr, @ktrtrs, Ap Cm Jagan, Central, Kcr, Kcr Jagan, Krishna, Security

ప్ర‌స్తుతం కేంద్రంపై ఆయ‌న లాగా నోరు విప్పగలిగే ధైర్యం జ‌గ‌న్‌కు లేద‌నే చెప్పాలి.ఆయ‌న‌పై కేసులు ఉండ‌టంతో కాస్త సైలెంట్‌గానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు.కానీ కేసీఆర్‌పై ఎలాంటి కేసులు లేక‌పోవ‌డంతో తనకు తానే సాటి సంకేతం ఇస్తున్నారు.ఇప్పుడు ప్ర‌తిప‌క్షాల‌న్నీ ఒక్క తాటిమీద‌కు వ‌స్తున్న నేప‌థ్యంలో త‌న ప్రాధాన్య‌త‌ను తెలియ‌జేసేలా ఆయ‌న రాజ‌కీయాలు చేస్తున్నారు.

మ‌రి కేసీఆర్ ప్లాన్ ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో లేదా బెడిసి కొడుతుందా ల‌నేది వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube