పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముందున్న అసలు ఛాలెంజ్ ఇదే?

తెలంగాణలో గత తొమ్మిది సంవత్సరాలుగా కాంగ్రెస్ తెలంగాణలో జరిగిన ప్రతి ఎన్నికలో ఓటమిపాలవుతూ వస్తున్న సంగతి తెలిసిందే.అయితే రెండు పర్యాయాలు ఓడిపోవడంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనైనా సత్తా చాటాలన్నది కాంగ్రెస్ నాయకుల ఆకాంక్ష.

 Is This The Real Challenge Before Pcc Chief Rewanth Reddy , Telangana Politics,-TeluguStop.com

అయితే ఇన్ని రోజులు నాయకత్వ లోపంతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీకి రేవంత్ ఆశా కిరాణంలా కనిపించాడు.అయితే చాలా రకాల ట్విస్ట్ ల తరువాత రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా నియమించడంతో  కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.

అయితే ఇప్పుడు రేవంత్ ముందు చాలా రకాల ఛాలెంజ్ లు ఉన్నాయి.రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ నియోజకవర్గాలలోని కాంగ్రెస్ కార్యకర్తలలో ముందుగా భరోసా నింపి, అత్యంత యాక్టివ్ గా ప్రజా సమస్యలపై పోరాడేలా చేస్తే తప్ప ప్రజల చూపు కాంగ్రెస్ వైపు మళ్లే అవకాశం లేదు.

జులై 7 వ తేదీ మధ్యాహ్నం 1;30 గంటలకు పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టనున్న సంగతి తెలిసిందే.ఇక మొదటిగా హుజూరాబాద్ వైపు దృష్టి పెట్టి ఆ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు రేవంత్ వ్యూహం రచిస్తున్నట్టు సమాచారం.

ఏది ఏమైనా కెసీఆర్ కు ఇటు బీజేపీ నుండి కాంగ్రెస్ నుండి ఎదురుదాడి అనేది పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube