కరోనా గురించి తెలియనిది ఇతనొక్కడికే?

కరోనా వైరస్ విజృంభణ గురించి అసలు తెలియని వారు ఉండరు.అయితే కరోనా వైరస్ విజృంభణతో ఎన్ని రంగాలు అతలాకుతలమయ్యాయో మనం చూసాం.

 Is This The Only One Joseph Flavill Who Doesn't Know About Corona, Viral News,la-TeluguStop.com

కొన్ని కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోవడం నిరుద్యోగులుగా మారడం, ఎన్నో వ్యాపారాలు దెబ్బ తినడంతో కంపెనీలు మూసివేసుకున్న పరిస్థితి ఉంది.ఒక్కసారిగా ప్రభుత్వం లాక్ డౌన్ విధించడం తో అప్పటిదాకా ఉన్న పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.

కొంచెం జ్ఞానం ఉన్న వారి దగ్గరి నుండి మొదలుకొని ముసలివారికి కరోనా గురించి తెలుసు.కాని అసలు కరోనా వచ్చిందని కూడా తెలియని ఓ వ్యక్తి ఉన్నారు.

ఏంటి మీరు నమ్మడం లేదా.అవును అక్షరాల నిజం.

అయితే మీరు ఇది చదవాల్సిందే.ఇక అసలు విషయంలోకి వెళ్తే ఇంగ్లాండ్ లోని స్టోఫోర్డ్ షైర్ కు చెందిన జోసఫ్ ఫ్లావిల్ అనే కుర్రాడు కారు ప్రమాదంలో కోమాలోకి వెళ్లడంతో అసలు ఈ కరోనా గురించి అతనికి తెలియడం సాధ్యపడలేదు.

అయితే మొత్తంగా పది నెలలు కోమాలో ఉన్న జోసఫ్ ఎట్టకేలకు మేల్కొనడంతో ఇప్పుడు కరోనా గురించి చెబితే అతను ఇప్పుడు ఆశ్చర్యపోతున్నాడు.ఇప్పుడు ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.

ఈ వార్త చూసిన నెటిజన్లు ఎవరూ ఈ కుర్రాడు అని నెటిజన్లు వెతకడం ప్రారంభిస్తున్నారు.అయితే ఇవన్నీ తెలియని తనకు ఆ కుర్రాడికి ఇప్పుడు ఈ కరోనా రూల్స్, మార్గదర్శకాలు కొత్తగా అనిపిస్తున్నాయి.

ఇవి అర్థం కావడానికి కొద్ది సమయం పట్టినా, ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా గురించి తెలియని వ్యక్తి కూడా ఉన్నారనేది కొంచెం వింతగా అనిపించినా ఇది అక్షరాల నిజం.

Telugu Coma, Corona, England, Joseph Flavill, Latest-Latest News - Telugu.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube