కేసీఆర్ వరుస ఆకస్మిక పర్యటనల నిర్ణయం వెనుక ఉన్న ఆంతర్యం ఇదే?

కేసీఆర్ ఇప్పుడు తన శైలికి భిన్నంగా చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారుతున్న పరిస్థితి ఉంది.ఇప్పటివరకు కేసీఆర్ ప్రగతి భవన్ నుండి బయటికి రావడం లేదు అని చేస్తున్న ప్రచారానికి అడ్డుకట్ట వేయడానికి అద్భుతమైన ప్రణాళికలు రచిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది.

 Is This The Motive Behind Mass Series Of Surprise Trips With Kcr Decision-TeluguStop.com

ఇక మనం భవిష్యత్తులో గెలవాలంటే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలపై ప్రజల్లో మంచి పేరుండాలి.లేకపోతే మరల గెలిచే అవకాశం ఉండదు.

అందుకే ఎమ్మెల్యే ల పనితీరును బేరీజు వేయడానికి కేసీఆర్ ఆకస్మిక పర్యటన చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఒక సర్వే కూడా ఎమ్మెల్యే పని తీరుపై అసంతృప్తిగా ఉన్నారని తేలడంతో మరల టీఆర్ఎస్ గెలవడం కష్టమని సర్వేలో ఒకింత పరోక్ష ఫలితాలు రావడంతో కెసీఆర్ అలర్ట్ అయినట్లు తెలుస్తోంది.

 Is This The Motive Behind Mass Series Of Surprise Trips With Kcr Decision-కేసీఆర్ వరుస ఆకస్మిక పర్యటనల నిర్ణయం వెనుక ఉన్న ఆంతర్యం ఇదే-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎక్కడైతే ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలుకావడం లేదో వాటిని గుర్తించి ఆకస్మిక పర్యటనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఒకవేళ కెసీఆర్ పర్యటనలో గమనించిన విషయాలపై అక్కడికక్కడ సమీక్ష నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఏది ఏమైనా కెసీఆర్ ఆకస్మిక పర్యటనల అంశం పెద్ద ఎత్తున ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు.ఎందుకంటే ప్రజల ముందుకు సీఏం వస్తే సమస్యలు ఎక్కువ శాతం పరిష్కారమవుతాయనేది ప్రజలకు ఆశగా ఉంటుంది కావున ఈ విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

#Kcr Alert #Trs Party #TRS MLAs #Pragati Bhavan #@CM_KCR

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు