ఈటెల ఓటమి చెందితే బీజేపీ తదుపరి వ్యూహం ఇదే?

ప్రస్తుతం బీజేపీ తెలంగాణలో రోజురోజుకు బలపడుతోంది.టీఆర్ఎస్ తరువాత రెండో ప్రత్యామ్నాయ స్థానం కోసం బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొంది.

 Is This The Bjp's Next Strategy If The Spearhead Loses Telangana Politics, Huzur-TeluguStop.com

అయితే ప్రస్తుతం బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ వ్యతిరేకతను పెంచుతూ ప్రభుత్వ వైఫ్యల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల్లోకి మరింత బలంగా వెళ్ళడానికి బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.అయితే బీజేపీ వ్యూహాలు ఫలించడంతో పాటు దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీ సత్తా చాటిన విషయం తెలిసిందే.

అయితే ఈటెల గెలుస్తారా లేరా అన్నది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. 

అయితే ఈటెల తన గెలుపుకై తీవ్రంగా కష్టపడుతున్న పరిస్థితి ఉంది.

ఒకానొక దశలో బీజేపీని చూసి కాదు తనను చూసి ఓటు వేయాలని తాను పాల్గొన్న ప్రచార సభలలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేగిన పరిస్థితి ఉంది.అయితే ప్రస్తుతం టీఆర్ఎస్ గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉందనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఈటెల ఓడిపోతే బీజేపీ కన్నా ఈటెలకు ఎదురుదెబ్బ తగిలినట్టవుతుంది.

అయితే  ఈటెల బీజేపీలో చేరకముందు బీజేపీకి పెద్దగా హుజూరాబాద్ లో బలం లేదు.ఈటెల చేరిక ముందు కంటే బీజేపీ బలం ఈటెల చేరిక తరువాత పుంజుకున్న మాట వాస్తవం.

Telugu Bandi Sanjay, Bjp, Huzurabad, Telangana, Trs, Ts Poltics-Political

ఇలా ఈటెల బీజేపీలో కొనసాగితేనే బీజేపీకి ప్రస్తుతం ఉన్న బలం కొనసాగుతుంది.లేకుంటే మరల ఒకప్పటి స్థితికి చేరే అవకాశం ఎక్కువ శాతం ఉంది.అయితే ఈటెల హుజూరాబాద్ లో ఓడిపోతే ఈటెల పై సానుభూతి ప్రచారాన్ని పెద్ద ఎత్తున బీజేపీ మొదలుపెట్టే అవకాశం ఉంది.దీంతో టీఆర్ఎస్ విజయం ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీపై పడకుండా వ్యూహం పన్నే అవకాశం ఉంది.

అంతేకాక టీఆర్ఎస్ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిందని ప్రచారం చేసే అవాకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube