పార్టీ ప్రకటన తరువాత షర్మిల మొదటి టార్గెట్ ఇదే?

తెలంగాణ రాజకీయాలలో షర్మిల ఎంట్రీ అన్నది ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పవచ్చు.ఎటువంటి అలజడి లేకుండా ఎవరూ కనీసం ఊహించకుండా పార్టీ నిర్మాణ ప్రక్రియను ప్రారంభించిన రాజకీయ నాయకురాలు బహుశ షర్మిల అనే చెప్పాలి.

 Is This Sharmilas First Target After The Party Announcement-TeluguStop.com

ఎందుకంటే రాజకీయ పార్టీ నిర్మాణాన్ని అంత తేలికగా ఎవరికీ తెలియకుండా జాగ్రత్త వహించడం అంత తేలిక కాదు.అయితే జులై 18 న షర్మిల పార్టీ పేరును, పార్టీ సిద్దాంతాలను ప్రకటించనున్న విషయం తెలిసిందే.

అయితే పార్టీ పేరును అధికారికంగా ప్రకటించిన తరువాత షర్మిల ముఖ్యంగా కేసీఆర్ వైఫల్యాలపై దృష్టి సారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.అదే విధంగా ఇక క్షేత్ర స్థాయిలో సమస్యలపై పథకాలు అమలు కాకపోవడం పట్ల ప్రజల క్షేత్ర స్థాయి సమస్యల పట్ల దృష్టి సారించే అవకాశం ఉంది.

 Is This Sharmilas First Target After The Party Announcement-పార్టీ ప్రకటన తరువాత షర్మిల మొదటి టార్గెట్ ఇదే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేకాక ఇప్పటికే క్షేత్ర స్థాయి నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్న షర్మిల క్షేత్ర స్థాయి ప్రజలను ఆకట్టుకునేలా వ్యూహ రచన చేస్తున్న పరిస్థితి ఉంది.అయితే ఇప్పటివరకు ఏ విషయాన్ని ప్రజలకు బాహాటంగా, స్పష్టంగా చెప్పకపోయినా ఇంకా ప్రజలకు షర్మిల పార్టీపై పూర్తిగా ఇంకా అవగాహన లేని పరిస్థితి ఉంది.

ఇంకా భవిష్యత్ లో  తెలంగాణ రాజకీయాలలో షర్మిల ఎలాంటి పాత్ర పోషిస్తారనేది చూడాల్సి ఉంది.

#July 18 #SharmilaParty #SharmilaParty #YsSharmila #YS Sharmila

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు