తాలిబ‌న్ల‌కు ఇదేం స‌ర‌దా.. పిల్ల‌లు ఆడుకునే వాటితో ఏం చేస్తున్నారంటే..

ఇప్పుడు ప్ర‌పంచం మొత్తం ఆఫ్ఘ‌నిస్తాన్ గురించే చ‌ర్చించుకుంటోంది.తాలిబన్ల వశమైనప్ప‌టినుంచి ఈ దేశంలో ప‌రిస్థితులు భ‌యంక‌రంగా మారుతున్నాయి.

 Is This Right For The Taliban .. What Are They Doing With What Children Are Play-TeluguStop.com

ఎప్పుడు ఏం జ‌రుగుతుందో అని ఆఫ్ఘ‌నిస్తాన్ ప్రజలు భ‌యం భ‌యంగా బ‌తుకుతున్నారంటే ప‌రిస్థితులు ఎలా ఉన్నాయో ఊహించ‌వ‌చ్చు.ఇక ప్ర‌జ‌లు ఇలా భ‌య‌ప‌డిపోతుంటే తాలిబన్లు మాత్రం ప్ర‌వ‌ర్తిస్తున్న తీరు చూస్తుంటే అందరూ షాక్ అవ్వాల్సిందే.

వారు పిల్ల చేష్టల మాదిరి చేస్తున్న ప‌నులు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.వీరు చేసే ప‌నులు ఎవ‌రికీ అర్థం కావ‌ట్లేదు.

కాబూల్‌ను ఈ తాలిబ‌న్లు ఆక్ర‌మించుకున్న త‌ర్వాత మాత్రం జ‌రుగుతున్న ప‌రిణామాలు అత్యంత భ‌యంక‌రంగా ఉంటున్నాయి.అయితే కొంద‌రు తాలిబ‌న్లు మాత్రం ఏదో చిన్న పిల్ల‌లు తెలియ‌క చేస్తున్న‌ట్టు చిత్ర విచిత్రంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు.

రీసెంట్ గా వీరు దేశ అధ్యక్షుడి భవనంలోకి వెళ్లి చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు.అధ్య‌క్షుడి కుర్చీల్లో కూర్చొని స‌ర‌దాగా ఫోటోలు దిగ‌డం, ఇక మొన్నటికి మొన్న అమెరికా వ‌దిలి వెళ్లిన యుద్ధ విమ‌నాల‌కు ఉయ్యాల క‌ట్టుకుని ఊగ‌డం లాంటివి చూశాం.

ఇక ఇప్పుడు కూడా ఇలంటి ప‌నే చేశారు.

Telugu Afghnistan, Child, Cars, Taliban, Talibans, Chairs-Latest News - Telugu

అదేంటంటే రీసెంట్ గా ఈ తాలిబ‌న్లు పిల్లలు ఆడుకునే ఎమ్యూజ్‌మెంట్‌ పార్కులోకి ఎంట‌ర్ అయి నానా హంగామా చేశారు.ఇందులో చిన్న పిల్లలు ఆడుకునే వ‌స్తువుల‌పై వారి క్రీడా నైపుణ్యం చూపించారు.పిల్ల‌ల కార్లు, గుర్రాల మీదకు ఎక్కి మ‌రీ గన్నులతో బోట్ల మీద ఆట‌లాడుకున్నారు.

ఇక ఇలా వీరు చేస్తున్న వీడియోలు చూసిన వారంతా కూడా వీరికి మ‌తిస్థిమితం స‌రిగ్గా లేన‌ట్టుంద‌ని చెబుతున్నారు.ఇలాంటి వారు దేశాన్ని ఏలితే చాలా ప్ర‌మాదం అంటూ కామెంట్లు చేశారు.

వారి మాన‌సిక స్థితి బాగా లేద‌ని తెల‌స్తోందంటున్నారు.ఇక వీరి చేష్ట‌ల‌కు సంబంధించిన ఫొటోలు బాగా వైరల్‌ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube