టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత ఆయన నటించిన చిత్రం సర్కారీ వారి పాట సినిమా ద్వారా మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇక ఈ సినిమా మొదటి షో తోనే మిశ్రమ స్పందన దక్కించుకున్నప్పటికీ అత్యధికంగా ఓపెనింగ్స్ రాబట్టిందని నివేదికలు తెలియజేస్తున్నాయి.
ఈ క్రమంలోనే మహేష్ బాబు నటించిన సర్కారీ వారి పాట సినిమా చూసిన పలువురు సెలబ్రిటీలు ఈ సినిమా గురించి వారి స్పందన ఏంటో తెలియజేస్తున్నారు.
ఇప్పటికే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మంచు విష్ణు వంటి తదితరులు ఈ సినిమా చూసి సినిమా ఎంతో అద్భుతంగా ఉందని వారి అభిప్రాయాన్ని తెలియజేశారు.
తాజాగా ఈ సినిమాని ప్రభాస్ చూసి తన అభిప్రాయాన్ని తెలియజేశారు అంటూ పెద్దఎత్తున వార్తలు వస్తున్నాయి.మహేష్ బాబు నటించిన ఈ సినిమాని చూసిన ప్రభాస్ సినిమా ఎంతో అద్భుతంగా ఉందని ముఖ్యంగా మహేష్ బాబు కామెడీ టైమింగ్ చాలా బాగుందని ప్రభాస్ తన సన్నిహితుల దగ్గర ప్రస్తావించినట్టు సమాచారం.
ఈ విధంగా ప్రభాస్ మహేష్ బాబు సినిమా పై తన అభిప్రాయాన్ని తన సన్నిహితుల దగ్గర వెల్లడించినట్లు వార్తలు వస్తున్నప్పటికీ ఈ విషయం గురించి ఏ విధమైనటువంటి అధికారిక సమాచారం లేదు.ఏది ఏమైనా మహేష్ సినిమాపై ప్రభాస్ స్పందించారనే విషయం తెలియగానే మహేష్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే మహేష్ బాబు ప్రభాస్ వ్యక్తిగతంగా మంచి స్నేహితులు అనే విషయం మనందరికీ తెలిసిందే.