పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక సినిమా పూర్తి అయితె తప్ప మరో సినిమా గురించి పెద్దగా ఆలోచించడు.అత్తారింటికి దారేది తరువాత పవన్ సోలో హీరోగా సినిమా వచ్చి రెండు సంవత్సరాలు దాటింది.
ఈ ఏడాది వచ్చిన మల్టిస్టారర్ గోపాల గోపాల ఆశించిన ఫలితాన్ని.ఇవ్వలేదు.
ఇక గబ్బర్ సింగ్ బ్రాండ్ తో పవన్ కేరీర్ లోనే అత్యంత క్రేజి ప్రాజెక్టుగా వస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ తరువాత పవన్ సినిమా ఏది?
త్రివిక్రమ్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే దాదాపు ఖరారైనా , సర్దార్ తరువాత ఇదే ఉంటుందా అంటే చెప్పలేం.ఇది పక్కన పెడితే గోపాల గోపాల తీసిన కిషోర్ కుమార్ పార్దాసాని కి మరో అవకాశం ఇస్తానని మాటిచ్చాడు పవర్ స్టార్.
ఈ చిత్రం ఉంటుందని, హిందిలో పీకే తరువాత అతి పెద్ద హిట్ గా నిలిచిన సల్మాన్ ఖాన్ బజరంగీ భాయిజాన్ ని కిషోర్ కుమార్ పార్దాసాని దర్శకత్వంలో రీమేక్ చేయాలని పవన్ భావిస్తున్నట్లు ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తారని టాక్.
పవన్ కెరీర్ ను మలుపుతిప్పిన “గబ్బర్ సింగ్” కూడా సల్మాన్ చిత్రం దబాంగ్ కి రీమేక్ అన్న సంగతీ విదితమే.