ఇదేందయ్యా ఇది: కారం నీళ్లతో స్నానం.. ఆపై దేవుడికి మద్యం, సిగరెట్లు సమర్పణ..!

సాధారణంగా వంటల్లో కాస్త కారం ఎక్కువైతేనే అల్లాడిపోతాం మనం.కారంపొడి శరీరానికి తగిలినా, చిన్న రేణువైనా కంట్లో పడినా విలవిల్లాడిపోతాం.

 Is This It: Take A Bath With Chili Water  And Then Offer Alcohol And Cigarettes-TeluguStop.com

అలాంటిది ఒక పూజారి ఏకంగా 108 కేజీల కారం కలిపిన నీళ్లతో స్నానం చేశారు.ఆదివారం ఆది అమావాస్య నేపథ్యంలో తమిళనాడులోని ఒక గ్రామంలో ఇలా పూజా కార్యక్రమాలు జరిగాయి.

అంతేకాకుండా వాళ్లు మందు, సిగరెట్లను దేవుడికి సమర్పించడం ప్రస్తుతం కలకలం రేపుతోంది.ఇటువంటి పూజా విధానం మరెక్కడా ఇది వరకూ జరగలేదు.

గ్రామ ప్రజలు కూడా ఈ పూజను ఎంతో నిష్టతో చేస్తుంటారు.చుట్టుపక్కల ప్రజలు అక్కడికి వచ్చి తమ మొక్కులను చెల్లించుకుంటారు.

ప్రస్తుతం ఈ ఘటన వైరల్ అవుతోంది.తమిళనాడులోని ధర్మపురి జిల్లాలోనినడపనహళ్లి గ్రామంలో ప్రతి ఏటా ఆది అమావాస్య రోజున సామూహిక వేడుకలు జరుగుతాయి.

గ్రామ దైవం పెరియ కరుప్పసామికి పాలు, కారంపొడితో అభిషేకం చేస్తారు.భక్తులు మద్యం, సిగరెట్లు కూడా దేవుడికి సమర్పిస్తారు.

అనంతరం సాంప్రదాయ వేడుక ప్రారంభమవుతుంది.

గ్రామ దైవానికి అనేక పూజా కార్యక్రమాలు నిర్వహించే పూజారి గోవిందం రెండు కొడవళ్లపై నిలబడి భక్తుల సమస్యలను వింటారు.

ఆ తర్వాత కారం యజ్ఞంలో ఆయన పాల్గొంటారు.కొడవలి పట్టుకుని కూర్చొనే ఆయన పై 108 కేజీల కారం కలిపిన నీళ్లను భక్తులు తలపై నుంచి పోసి అభిషేకం చేస్తారు.

ఇలా చేయడం వల్ల తమలో దుష్టశక్తులు, దురదృష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.అయితే భక్తులు కారం నీళ్లు పోసేంత వరకు పూజారి గోవిందం కదలకుండా మెదలకుండా అలానే ఉండి పోతారు.

Telugu Liquir, Meida, Spicy Bath, Latest-Latest News - Telugu

మరోవైపు ఆ కారం ఘాటు వల్ల అక్కడి భక్తులు ఊపిరి పీల్చలేక ఉక్కిరి బిక్కిరి అవుతారట .అనంతరం పూజారి శరీరం పై కారం మరకలు పోయేంత వరకు లీటర్ల కొద్దీ మంచినీళ్లను భక్తులు ఆయన పై గుమ్మరిస్తారు.ఊరికి మంచి జరగడం నమ్మకమే అయినప్పటికీ కారం నీళ్లతో స్నానం చేయడం పూజారి చేస్తున్న సాహసమనే చెప్పొచ్చు.ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube