ఇదేందయ్యా ఇది: ఇలాంటి యాడ్ ఎప్పుడైనా చూసారా..?  

మామూలుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు చాలా రోటీన్ గా ఉంటే, కొన్ని అర్థం పర్థం లేని విధంగా ఉండటం మనం తరచూ గమనిస్తూనే ఉంటాం.అందులో కొన్ని యాడ్స్ మనసుకు హత్తుకునేలా కనిపించినా.

TeluguStop.com - Is This It Have You Ever Seen An Ad Like This

మరికొన్ని ప్రకటనలు చూస్తే ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సాహసాలు చేస్తున్నట్లు అందులో చూపించి అబ్బుర పరుస్తున్నారు.ఇంకొన్ని అయితే ప్రకటనల అసలు ఎందుకు ప్రకటన చేస్తారో.

వారు చెప్పాల్సిన అంశానికి వారు చేసిన యాడ్ కి సంబంధం లేకుండా వాటిని ప్రేక్షకుల మీదకి వదులుతూ ఉంటారు.ఇలాంటి నేపథ్యంలోనే తాజాగా ఓ ప్రకటన కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

TeluguStop.com - ఇదేందయ్యా ఇది: ఇలాంటి యాడ్ ఎప్పుడైనా చూసారా..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే…

నిజానికి ఈ ప్రకటన చూస్తే ఏడవాలో లేకపోతే నవ్వాలో అర్థం తెలియక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు.ఫిలిపిన్స్ దేశానికి చెందిన ఆర్సి కోలా అనే సంస్థకు చెందిన ఈ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఒకటిన్నర నిమిషం ఉన్న ఈ ప్రకటనలో ఎన్నో అర్థం కాని సంఘటనలు మనుషులు తలలు పట్టుకునేలా చేస్తున్నాయి.ఈ యాడ్ లో ఓ పిల్లోడు స్కూల్ బ్యాగ్ తో ఇంటికి వచ్చిన తర్వాత అమ్మా నన్ను మీరు దత్తత తీసుకున్నారా అని అడగగా ఆ ప్రశ్నకు తన తల్లి ఇతరుల మాటలు మనసులో పెట్టుకోవద్దు అంటూ డైలాగ్ చెబుతుంది.

ఆ తర్వాత ఆ పిల్లవాడు స్కూల్ బ్యాగ్ ను వదిలి షర్ట్ విప్పి ఓ బల్లపై బోర్లా పడుకొని తన వీపుకు ఉన్న నాలుగు గాజు గ్లాసులను చూపిస్తాడు.అలా చూపిస్తూ నా వెనుక ఈ గ్లాస్ లు ఎలా వచ్చాయి అమ్మ అంటూ అని అడుగుతాడు.

దీనితో ఆ పిల్లాడి తల్లి తనకి నిజం చెప్పే సమయం వచ్చింది అంటూ.తన తల్లి తలను తీసేస్తూ తనలో దాగి ఉన్న ఆర్సి కోలా కూల్ డ్రింక్ బాటిల్ ను చూపిస్తుంది.

ఆ తర్వాత ఆ కూల్ డ్రింక్ ను గ్లాసులో పోసి ఆ గ్లాస్ లోని కూల్ డ్రింక్ ను తల్లి పిల్లలతో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా స్ట్రాలు వేసుకుని మరి తాగడంతో ఆ ప్రకటన ముగిస్తుంది.అయితే ఈ ప్రకటనలో తల్లి కూల్ డ్రింక్ బాటిల్ లాగా ఉంది కాబట్టి గ్లాసెస్ తో పుట్టిన పిల్లాడిని దత్తత తీసుకున్నారా లేదా ఆమె కూల్ డ్రింక్ కాబట్టి కొడుకు గ్లాసులతో పుట్టాడా అనే సందేహం మాత్రం నివృత్తి కాలేదు.

దీంతో నెటిజెన్స్ ఏం చేయాలో తెలియక తల పట్టుకున్నారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ప్రకటన చూసి మీకు ఏం అర్థం అయిందో కామెంట్ చేయండి.

#Cool Drink #Cola Drink #Philipins #Rc Cola Bottle #Viral Video

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు