ఇదేందయ్యా ఇది: ముక్కుతో ఫ్లూటు వాయిస్తున్న ఘనుడు..!

ప్రతి ఒక్క మనిషి లో ఏదో ఒక టాలెంట్ కలిగి ఉంటుంది.దాన్ని ఎంత త్వరగా గుర్తించి ఆ తర్వాత అంత దానిపై సాధన చేస్తే ఎవరికీ అందనంత ఎత్తులో నిలవడం ఖాయం.

 Is This It A Bull Playing The Flute With Its Nose, Flute, Mouth, Playing With No-TeluguStop.com

ఇకపోతే సంగీత వాయిద్యాలలో ఒకటైన ఫ్లూట్ ను ఎవరైనా సరే నోటితో గాలిని ఊది వేణు గానం చేయడం మనం చూస్తూనే ఉంటాం.అయితే తెలంగాణ రాష్ట్రంలో ఓ వ్యక్తి పిల్లన గ్రోవిని ముక్కుతో ఊది వాయిస్ తో అందరినీ అబ్బుర పరుస్తున్నాడు.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

మహబూబ్ నగర్ జిల్లాలోని ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామానికి చెందిన గట్టు కురుమన్న పశువుల కాపరిగా పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.

అయితే పశువులను మేపే సమయంలో సమయాన్ని వృధా చేయకూడదు అని భావించిన ఆయన ఓ జాతరలో ఫ్లూటు కొనుగోలు చేసి దానితో సినిమా పాటలు, అలాగే కొన్ని జానపద పాటలను ఆలకిస్తూ ఉండేవాడు.అయితే నోటితో ఇలా చేయడం అందరూ కామన్ గా చేస్తారు.

కాకపోతే, తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని భావించాడు ఆయన.దీంతో ఎంతో కష్టసాధ్యమైన పనిని ఆయన చాలా సులువుగా సాధన చేసి విజయం సాధించాడు.ఇందులో భాగంగానే ఆయన ముక్కుతో ఫ్లూటు వాయించడం సాధన చేసి విజయం సాధించాడు.

కురుమన్న ముక్కుతో ఫ్లూటు వాయిస్తూ అనేక గీతాలను ఆలపిస్తూ అందర్నీ ఆకర్షిస్తున్నాడు.

వారి గ్రామం, చుట్టుపక్కల గ్రామాలలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ఆయన ముక్కుతో ఫ్లూటు వాయిస్తున్న సమయంలో తనకు తన గ్రామ ప్రజల నుంచి మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉండే గ్రామ ప్రజల నుంచి కూడా మంచి సపోర్ట్ లభిస్తుందని ఆయన చెప్పుకొచ్చాడు.అంతేకాదు ముక్కుతో ఫ్లూటు వాయించడం ఎవరికైనా ఇష్టం అయితే తాను శిక్షణ ఇస్తా అని కురుమన్న ధీమాగా చెబుతున్నాడు.

ఏది ఏమైనా టాలెంట్ నిరూపించుకోవడానికి ఏలాంటి డబ్బు ఆర్భాటాలు లేకపోయినా సరే అది ప్రపంచానికి ఇట్టే తెలిసిపోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube