బీజేపీ-జ‌నసేన‌ల బంధానికి అదే బ్రేక్ వేస్తోందా ?

త్వ‌ర‌లో జ‌ర‌గనున్న తిరుప‌తి పార్ల‌మెంటు స్థానం ఉప ఎన్నిక‌లో టికెట్ నీకా-నాకా? అనే చ‌ర్చ జ‌న‌సేన‌-బీజేపీల మ‌ధ్య జోరుగా సాగుతోంది.గ్రేటర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో తాను పోటీకి దూరంగా ఉండి.

 Is This Giving Break To Janasena - Bjp Relation?,ap, Ap Political News, Latest N-TeluguStop.com

త‌న కార్య‌క‌ర్త‌ల‌తో ప్ర‌చారం కూడా చేయించి.బీజేపీకి 48 స్థానాలు వ‌చ్చేందుకు కృషి చేసినందున త‌న కే ఇవ్వాల‌ని తాజాగా కూడా జ‌న‌సేనాని ప‌వ‌న్ వ్యాఖ్యానించ‌డం చ‌ర్చ‌కు దారితీసింది.

ప్ర‌స్తుతం తిరుప‌తి ఉప ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని ప‌వ‌న్ రాష్ట్ర వ్యాప్తంగా నివ‌ర్ తుఫాన్ బాధిత రైతాంగాన్ని ప‌రామ‌ర్శిస్తున్నారు.పైకి ఆయ‌న తిరుప‌తి ఉప ఎన్నిక విష‌యాన్ని వెల్ల‌డించ‌క‌పోయినా.

ఆయ‌న వ్యూహం మాత్రం తిరుప‌తి ఉప పోరును దృష్టిలో ఉంచుకునే చేస్తున్నార‌ని అంటున్నారు.

అయితే.

బీజేపీ ఈ విష‌యంలో వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.గ్రేటర్ ఎన్నిక‌ల్లో త‌మ‌కు ప్ర‌చారం చేస్తాన‌ని చెప్పిన ప‌వ‌న్ ప్ర‌చారానికి దూరంగా ఉండ‌డాన్ని పార్టీ నాయ‌కులు అప్పుడే ప్ర‌చారంలో కి తెచ్చారు.

కేవ‌లం బీజేపీ బ‌లంలోనే తాము గెలుపు గుర్రం ఎక్కామ‌ని బండి సంజ‌య్ ప్ర‌చార‌మే క‌లిసి వ‌చ్చింద‌ని ఏపీకి చెందిన బీజేపీ నాయ‌కులు విష్ణు వ‌ర్ధ‌న్ రెడ్డి వంటివారు అప్పుడే వ్యాఖ్య‌లు చేశారు.ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే ప‌వ‌న్ వ‌ల్ల గ్రేట‌ర్‌లో సీట్లు సాధించామ‌నే విష‌యాన్ని వారు అప్పుడే ప‌క్క‌న పెట్టేస్తున్నారు.

Telugu Ap, Ghmc, Jagan, Janasena, Janasenani, Latest, Pawan Kalyan, Ship, Ysrcp-

మ‌రోవైపు.తిరుప‌తి ఉప పోరును బీజేపీ కూడా ప్ర‌తిష్టాత్మ‌కంగానే తీసుకుంది.ఈ క్ర‌మంలోనే సీమ ప్రాంతానికి చెందిన విష్ణు వ‌ర్ధ‌న్ రెడ్డి ప్ర‌చారంలోకి దిగిపోయారు.వివిధ పార్టీల నాయ‌కులు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగాన్ని ప‌రామ‌ర్శిస్తుంటే.ఆయ‌న మాత్రం రోడ్లు బాగోలేవ‌ని.చిన్న‌వ‌ర్షానికే రోడ్లు చెరువులు త‌ల‌పిస్తున్నాయ‌ని పేర్కొంటూ నిర‌స‌న‌లకు దిగారు.

మొత్తంగా చూస్తే అటు జ‌న‌సేన‌, ఇటు బీజేపీ కూడా వ్యూహా త్మ‌కంగా తిరుప‌తి ఉప ఎన్నిక ప్ర‌చారాన్ని ప్రారంభించాయ‌నే చెప్పాలి.

మరి ఇప్ప‌టికీ తేల‌ని టికెట్ విష‌యంలో ఎలా ముందుకు వెళ్తాయ‌నేదే మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

ప్ర‌స్తుతం ఈ వివాదం.కేంద్రం కోర్టులో ఉంది.

అయితే.కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు మాత్రం తిరుప‌తిలో తామే పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు ఢిల్లీ వ‌ర్గాల నుంచి అందుతున్న స‌మాచారం.

ఇదే క‌నుక వాస్త‌వం అయితే బీజేపీ-జ‌నసేన ల మ‌ధ్య బంధం మూడు రోజుల ముచ్చ‌ట‌గానే మారుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube